AP Rains: 3 గంటల నుంచి స్థిరంగా వాయుగుండం..ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
వాయవ్య బంగాళాఖాతంలో తీవ్రంగా కొనసాగుతున్న వాయుగుండం ఒడిశాలోని చిల్కా సరస్సుకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం గత మూడు గంటలుగా అదే ప్రాంతంలో స్ధిరంగా ఉంది. ఇది రాగల 12 గంటల్లో బలహీనపడి తిరిగి అల్పపీడనంగా మారనుందని ఐఎండీ పేర్కొంది.