బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వానలే..వానలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా రూపాంతరం చెందుతుంది.దీంతో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ పేర్కొంది.

New Update
hyd

Ap Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీ ధనంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ ఈ నెల 25కల్లా దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుం దంగా బలపడనున్నది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో బుధవారం నుంచి శనివారం వరకు కోస్తా జిల్లాల్లో కొన్నిజిల్లాల్లో  భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం నుంచి సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకా రులు వేటకు వెళ్లొద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు.బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం నవంబర్‌  27కల్లా తమిళనాడు, శ్రీలంక తీరాల దిశగా రానున్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది తుఫానుగా బలపడుతుందని  వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read:  

అల్పపీడనం 28 వరకు పశ్చిమంగా పయనించి ఆ తరువాత మరింత బలపడి వాయుగుండంగా మారే క్రమంలో ఉత్తర వాయవ్యంగా పయనించి 28 నాటికి పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలోకి ప్రవేశిస్తుందని అనుకుంటున్నారు. అల్పపీడనం క్రమంగా బలపడి  30వ తేదీ రాత్రి కోస్తాంధ్రలో తీరం దాటుతుంది. మరో అంచనాలో  తీవ్ర అల్పపీడనం 26దీకల్లా నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి, తరువాత వాయువ్యంగా పయనించి 28వ తేదీ రాత్రికి పుదుచ్చేరి వద్ద తీరం దాటుతుంది.  రెండు మోడళ్ల ప్రకారం కోస్తాంద్ర రాయలసీమపై  ఎక్కువ తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు అనుకుంటున్నారు.

Also Read: Pushpa2 స్టేజీపైనే నిర్మాతపై షాకింగ్ కామెంట్స్ చేసిన దేవిశ్రీ ప్రసాద్‌

ఐఎండీ, జీఈపీఎస్ ప్రకారం ఆదివారం రాత్రికి వాయుగుండంగా మారి, తరువాత 26 సాయంత్రానికి  బలపడుతుంది. తరు వాత మయన్మార్ వైపు గా వెళుతుంది. ఎన్సీఈపి మోడల్ ప్రకారం కూడా వాయు గుండంగా బలపడిన తరువాత 27 వరకు పశ్చిమ వాయు వ్యంగా పయనించి, మయన్మార్ వైపు మళ్లుతుంది.

Also Read:  Sabarimala: శబరిమలకు పోటెత్తిన స్వాములు.. పంబ వరకూ క్యూలైన్!

దీని ప్రకారం సోమ, మంగ శవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల, ఉత్తరకోస్తాలో ఒకటి, రెండుచోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.  అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో, 29న విశాఖ, అనకాపల్లి, కాకినాడ. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

Also Read: మినీ అంగన్‌వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్

30న కోస్తా, రాయలసీ మలో పలుచోట్ల వరాలు కురుస్తాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని అధికారులు తెలిపారు. తర్వాత వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు- శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని భారత వాతావ రణ శాఖ పేర్కొంది.వాతావరణ శాఖ హెచ్చరికలతో దక్షిణ కోస్తా, రాయలసీమ  రైతాంగానికి గుబులు పట్టుకుంది. 27 నుంచి 30 వరకు భారీవరాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Also Read: Maharashtra: మహారాష్ట్ర సీఎం ఎవరూ ? మరికొన్ని గంటల్లో స్పష్టత

ప్రస్తుతం. ఖరీఫ్‌లో  రాష్ట్రం అంతటా వరి దండిగా పండింది. కోతలు సాగుతున్నాయి. మెట్ట ప్రాంతాల్లో ప్రాంతాల్లో పత్తి తీతలు పుంజుకున్నాయి. రబీ పంటలు మొలక మొక్క దశలో ఉన్నాయి. ఈ తరుణంలో భారీ వర్షాలు కురిస్తే నష్టం పోయే అవకాశాలున్నాయని రైతులు వాపోతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు