రేపే రథ సప్తమి.. ఇలా సూర్య భగవానుని పూజిస్తే.. విజయం మీ సొంతం

రథసప్తమి నాడు బ్రహ్మ ముహుర్తంలోనే లేచి నది లేదా సముద్ర స్నానం ఆచరించాలి. ఆ తర్వాత సూర్య పారాయణం, స్తోత్రాలు పఠించి పాయసం, రేగి పండ్లు వంటి వాటితో నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత సూర్యునికి మూడు సార్లు నీరు ఇచ్చి కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయి.

New Update
Rata Saptami

Rata Saptami Photograph: (Rata Saptami)

హిందువులు తప్పకుండా చేసే పూజల్లో రథ సప్తమి ఒకటి. ఈ సప్తమి నాడు సూర్య భగవానుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అన్ని విధాలుగా విజయం సిద్ధిస్తుందని పండితులు చెబుతుంటారు. అయితే తెలుగు క్యాలెండర్ ప్రకారం రేపే రథసప్తమిని పూజ నిర్వహిస్తారు. రథ సప్తమి నాడు సముద్ర లేదా నదీ స్నానం చేసి భక్తి శ్రద్ధలతో సూర్య భగవానుని పూజించడం వల్ల అన్ని సమస్యల నుంచి బయటపడతారు. అనుకున్న పనులు అన్ని కూడా జరుగుతాయి. మరి రథసప్తమి నాడు సూర్య భగవానుని ఎలా పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయో ఈ ఆర్టికల్‌లో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Allu Aravind: నా కొడుకుకు ఆరోగ్యం బాగోలేదు.. అందుకే అలా జరిగింది.! అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్!

నది లేదా సముద్ర తీరంలో..

రథసప్తమి నాడు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి సమీపంలో నది లేదా సముద్రం ఉంటే స్నానం చేయాలి. లేదంటే ఇంట్లోనే జిల్లేడాకుల నీటితో తలస్నానం ఆచరించాలి. ఇంటిని శుభ్రం చేసి దీపాలు వెలిగించాలి. ఎక్కువ మంది నది లేదా సముద్ర తీరంలో సూర్య భగవానుని పూజిస్తారు. వీటికి అనుకూలంగా లేని వారు ఇంట్లోనే సూర్యుడు కనిపించే మేడ మీద పూజ చేసుకోవాలి. 

ఇది కూడా చూడండి:  గ్రామీ అవార్డ్స్ వేడుకల్లో బట్టలు విప్పేసిన ర్యాప్ సింగర్ భార్య ఫొటో షూట్

సూర్యోదయం కాకముందే పూజ అంతా పూర్తి చేయాలి. రేగి పండ్లు, చెరకు, పాయసం ఇలా అన్నింటితో సూర్య భగవానికి నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత సూర్యుడికి మూడుసార్లు నీరు ఇచ్చి సూర్య పారాయణం చేయాలి. అలాగే రోజంతా ఉపవాసం కూడా ఆచరించవచ్చు. ఇలా రథ సప్తమి నాడు సూర్య భగవానుని పూజిస్తే.. ఆటంకాలు లేకుండా అన్ని విధాలుగా కూడా విజయం సాధిస్తారని పండితులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Kannappa: ప్రళయకాల రుద్రుడు.. కన్నప్ప నుంచి రెబల్ స్టార్ లుక్ ఎలా ఉందో చూడండి!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. 

ఇది కూడా చూడండి: Tata Steel Chess Masters: వరల్డ్ ఛాంపియన్‌ గుకేశ్‌పై.. ప్రజ్ఞానంద ఘన విజయం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు