పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రధానీ మోదీ విపక్షాలపై విమర్శలు చేశారు. అధికార దాహంగల పార్టీలను ప్రజలు తిరస్కరించారని.. ఇలాంటి పార్టీలు ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకోవన్నారు. కొందరు విపక్ష సభ్యులు బాధ్యతారహితంగా ఉంటారంటూ మండిపడ్డారు.
విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించండి.. బ్రిటన్కు ప్రధాని మోదీ విజ్ఞప్తి
భారత్ నుంచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీని అప్పగించాలని ప్రధాని మోదీ.. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ను కోరారు. బ్రెజిల్లో జీ20 దేశాల సదస్సుకు వెళ్లిన ఆయన ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధానికి ఈ అంశంపై విజ్ఞప్తి చేశారు.
Draupadi Murmu: ద్రౌపది ముర్ముపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఓ ఆదివాసి మహిళకు అత్యున్నత రాష్ట్రపతి పదవి ఇచ్చి గౌరవించిందని పేర్కొన్నారు. ఆమెకు ఆ పదవి అప్పగించడం ఎన్డీయే అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.
PM Modi: ప్రధాని మోదీకి తప్పిన పెను ప్రమాదం..
ప్రధాని మోదీకి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దేవగఢ్ ఎయిర్పోర్ట్లోనే ఆయన విమానం నిలిచిపోయింది. ఝార్ఖండ్లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
PM Modi: ప్రధాని మోదీకి మరో అరుదైన పురస్కారం.. ఏ దేశం ఇవ్వనుందంటే ?
ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. కరేబియన్లో ఉండే డొమినికా అనే ద్వీప దేశం ఆయనకు అత్యున్నత జాతీయ అవార్డును ప్రకటించింది. కరోనా సమయంలో భారత్ అందించిన సహకారానికి గుర్తుగా ఈ పురస్కారాన్ని అందించనున్నట్లు పేర్కొంది.
Nitish Kumar: మోదీ కాళ్లు మొక్కిన నితీశ్ కుమార్.. వీడియో వైరల్!
బిహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రధాని మోదీ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారు. బిహార్ దర్భంగ ఉప ఎన్నికల ప్రచార ర్యాలీ సభలో ఈ సన్నివేశం చోటుచేసుకోగా.. తన కాళ్లు తాకొద్దంటూ నితీశ్ చేతులు పట్టుకున్నారు మోదీ. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
పొలిటికల్ పవర్ లిస్ట్లో టాప్-5లో ఉన్న రాజకీయ నాయకులు వీళ్లే!
దేశంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల జాబితాని ఇండియా టూడో ఇటీవల విడుదల చేయగా.. ప్రధానమంత్రి మోదీ టాప్ ప్లేస్లో చోటు సంపాదించుకున్నారు. ఆ తర్వాత స్థానాల్లో మోహన్ భాగవత్, హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు.