G 20 Summit: ప్రపంచ అభివృద్ధికి ఆరు సూత్రాలు..ప్రతిపాదించిన ప్రధాని మోదీ

జీ 20 సదస్సులో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు భారత ప్రధాని మోదీ ఆరు కొత్త కార్యక్రమాలను ప్రతిపాదించారు. సాంప్రదాయ జ్ఞానాన్ని భద్రపరచడం, నైపుణ్య శిక్షణ, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో స్పందించే బృందాలు, డ్రగ్స్-ఉగ్రవాదంపై పోరాటం లాంటివి ఇందులో ఉన్నాయి.

New Update
G20

ప్రపంచాభివృద్ధికి, ఆఫ్రికా పురోగతికి భారత ప్రధాని మోదీ ఆరు సూత్రాలను ప్రతిపాదించారు. దక్షిణాఫ్రికా రాజధాని జోహనెస్‌బర్గ్ వేదికగా జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో వీటిని ఆయన ప్రతిపాదించారు. గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ, ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లియర్ ఇనిషియేటివ్, గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్, డ్రగ్స్-ఉగ్రవాదం ఎదుర్కొడానికి ప్రత్యేక కార్యక్రమం ఓపెన్ శాటిలైట్ డేటా పార్టనర్‌షిప్, క్రిటికల్ మినరల్స్ సర్క్యులారిటీ ఇనిషియేటివ్ ఇందులో ఉన్నాయి. వీటితో ప్రపంచం సుస్థిర అభివృద్ధి సాధిస్తుందని...దీనికి భారతీయ విలువలు, నాగరికతను దిశానిర్దేశం చేస్తాయని మోదీ చెప్పారు. 

భారత్ ఘన చరిత్ర..ప్రపంచ అభివృద్ధికి ఉపయోగపడుతుంది..

G20 గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీ, స్థిరమైన జీవనం..కాలం పరీక్షించిన నమూనాలను ప్రదర్శించే సాంప్రదాయ జ్ఞానాన్ని డాక్యుమెంట్ చేస్తుందని, దానిని భవిష్యత్ తరాలకు ముందుకు తీసుకెళ్లేలా చూస్తుందని మోదీ అన్నారు. ఈ విషయంలో భారత్ కు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని చెప్పారు. ఇది మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం మన సమిష్టి జ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు చేరవేయడంలో సహాయపడుతుంది అని ప్రధాని చెప్పారు. ప్రపంచ ప్రగతికి ఆఫ్రికా అభివృద్ధి అత్యంత కీలకమని...దానికి భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని మోదీ తెలిపారు. వచ్చే దశాబ్దం నాటికి ఆఫ్రికాలో ఒక మిలియన్ సర్టిఫైడ్ శిక్షకులను సృష్టించే లక్ష్యంతో ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లైయర్ ఇనిషియేటివ్ ట్రైన్-ది-ట్రైనర్స్ మోడల్‌ను అవలంబిస్తుందని ఆయన అన్నారు. రాబోయే దశాబ్దంలో ఆఫ్రికాలో పది లక్షల మంది సర్టిఫైడ్ శిక్షకులకు శిక్షణ ఇవ్వడమే మా సమిష్టి లక్ష్యం. ఈ శిక్షకులు లక్షలాది మంది నైపుణ్యం కలిగిన యువతకు శిక్షణ ఇస్తారు. దీని వలన స్థానికుల సామర్థ్యం పెరుగుతుంది. అలాగే ఆఫ్రికా దీర్ఘకాలిక అభివృద్ధిని బలోపేతం చేస్తుందని చెప్పారు.

ఆరోగ్య అత్యవసర పరిస్థితులు,ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో కలిసి పనిచేసినప్పుడు మనం బలంగా ఉంటాము. ఏదైనా ప్రపంచ ఆరోగ్య సంక్షోభం లేదా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు వేగంగా మోహరించడానికి సిద్ధంగా ఉన్న తోటి G20 దేశాల నుండి శిక్షణ పొందిన వైద్య నిపుణుల బృందాలను సృష్టించడం మన ప్రయత్నం అయి ఉండాలి" అని ప్రధాని మోదీ చెప్పారు. వీటితో పాటూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఫెంటానిల్ లాంటి ప్రమాదకరమైన పదార్థాల వ్యాప్తిని ఆపడానికి, అలాగే మాదకద్రవ్యాల-ఉగ్రవాద అనుబంధాన్ని ఎదుర్కోవడానికి కూడా మోదీ సూచించారు. ఆర్థికం, పాలన ,భద్రతకు సంబంధించిన వివిధ సాధనాలను మనం ఒకచోట చేర్చగలిగితే..మాదకద్రవ్యాల-ఉగ్రవాద ఆర్థిక వ్యవస్థను బలహీనపరచగలమని ప్రధాని మోదీ అన్నారు. దీంతో పాటూ రీసైక్లింగ్, అర్బన్ మైనింగ్, సెకండ్-లైఫ్ బ్యాటరీ ప్రాజెక్టులు,ఇతర ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రధాన మంత్రి మోదీ క్రిటికల్ మినరల్స్ సర్క్యులారిటీ ఇనిషియేటివ్‌ను కూడా మోదీప్రతిపాదించారు.

Advertisment
తాజా కథనాలు