National : బీజేపీలో భారీ మార్పులు..
2024 ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయని తెలుస్తోంది. ముఖ్య నేతల స్థానాల్లో మార్పులు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
2024 ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయని తెలుస్తోంది. ముఖ్య నేతల స్థానాల్లో మార్పులు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ఈసారి ఎన్నికల్లో మహారాష్ట్ర ముఖచిత్రం చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. ఎంత ప్రయత్నించినప్పటికీ బీజేపీ అక్కడ విజయం సాధించలేకపోయింది. మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ ఓటమి మూటగట్టుకుంది.
వరుసగా భారత ప్రధానిగా మూడోసారి పీఠం ఎక్కబోతున్న నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాల నేతల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి.. తాజాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మోదీకి ఫోన్ చేసి శుభాభినందనలు తెలిపారు
ఢిల్లీలో బుధవారం జరిగిన ఎన్డీయే సమావేశం పట్ల మోదీ స్పందించారు. "ఎంతో విలువైన మా ఎన్డీయే భాగస్వాములను కలవడం జరిగింది. జాతీయ పురోభివృద్ధితో పాటు ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడం కూడా మా కూటమి లక్ష్యమని ఆయన వివరించారు.
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 293 స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ .. ప్రధాని మోదీకి, ఎన్డీయే కూటమికి అభినందనలు తెలియజేశారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ప్రధాని మోదీకి ఫోన్ చేసి అభినందనలు చెప్పారు.
ఎన్డీయే పక్ష నేతగా మరోసారి నరేంద్ర మోదీనే ఎన్నుకున్నారు. దాదాపు గంటన్నర సేపు ఈ భేటీ కొనసాగగా.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జేడీయు నేత నితీష్ కుమార్, శివసేన షిండే వర్గం తదితర నేతలు.. ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రధాని మోదీ నివాసంలో ఈరోజు NDA సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఎన్డీయేకు పూర్తిగా మద్దతిస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రకటించారు. జూన్ 7న మరోసారి ఎన్డీయే నేతల సమావేశం జరగనుంది.
ప్రధాని మోదీ నివాసంలో NDA సమావేశం ముగిసింది. ఎన్డీయేకు పూర్తిస్థాయి మద్దతిస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రకటించారు. కేబినెట్లో మంత్రి పదవుల కోసం.. మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కీలక పదవులను టీడీపీ, జేడీయూ ఆశిస్తున్నట్లు సమాచారం.