CM Chandrababu : ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) ఢిల్లీ (Delhi) కి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక తొలిసారి హస్తిన పర్యటనకు వెళ్తున్నారు. రేపు ప్రధాని మోదీ (PM Modi) తో సమావేశం అవుతారు. కేంద్రమంత్రులను కూడా చంద్రబాబు కలవనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. విభజన హామీలతో పాటు ఆర్థిక అంశాలపై సమీక్ష చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) కు నిధులు, పారిశ్రామిక రంగానికి రాయితీలు, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రోత్సాహం కోసం విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక అంశంపై ప్రధానికి చంద్రబాబు నివేదిక ఇస్తారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు జరపాలని బాబు మోదీని కోరనున్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..CM Chandrababu ఈరోజు ఢిల్లీకి చంద్రబాబు.. రేపు మోదీతో కీలక భేటీ!
AP: ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. రేపు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై మోదీతో చర్చించనున్నారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక తొలిసారి హస్తిన పర్యటనకు వెళ్తున్నారు.
Translate this News: