Shubhanshu Shukla: స్వదేశానికి శుభాంశు శుక్లా...ఘన స్వాగతం పలికిన ప్రజలు
యాక్సియం-4 మిషన్తో భారత రోదసి చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా స్వదేశానికి తిరిగి వచ్చారు. అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకున్నాక అమెరికాలో ఉన్న ఆయన, ఆదివారం తెల్లవారుజామున భారత్కు చేరుకున్నారు.