ప్రధాని మోదీకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన శుభాంశు శుక్లా.. అది ఏంటో తెలుసా?

ISS యాత్రకు వెళ్లి ఇండియాకు వచ్చిన శుభాంశు శుక్లా ప్రధాని మోదీకి ఓ ప్రత్యేకమైన బహుమతి ఇచ్చారు. ప్రధాని మోదీకి శుభాంశు శుక్లా చాలా అరుదైన వస్తువు గిఫ్ట్‌గా తీసుకొచ్చారు. అదే అంతరిక్షంలో ప్రయాణించి వచ్చిన భారత త్రివర్ణ పతాకం, మిషన్ ప్యాచ్.

New Update
Shubhanshu Shukla gifts PM Modi

Shubhanshu Shukla gifts PM Modi

ఆక్సియం 4 మిషన్‌లో భాగంగా ISS యాత్ర పూర్తి చేసుకుని గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఇండియాకు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఇండియన్ ఆస్ట్రొనాట్ శుభాంశు శుక్లా చారిత్రాత్మక యాత్రకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రధాని మోదీతో పంచుకున్నారు. ఈ సందర్భంగా, శుక్లా ప్రధాని మోదీకి ఓ ప్రత్యేకమైన బహుమతి ఇచ్చారు. ప్రధాని మోదీకి శుభాంశు శుక్లా చాలా అరుదైన వస్తువు గిఫ్ట్‌గా తీసుకొచ్చారు. అదే అంతరిక్షంలో ప్రయాణించి వచ్చిన భారత త్రివర్ణ పతాకం, మిషన్ ప్యాచ్.

ప్రధాని మోదీని కలిసినప్పుడు శుక్లా ఒక ISRO ఆస్ట్రోనాట్ జాకెట్‌ను ధరించారు. ఈ సందర్భంగా, ప్రధాని ఆయనను ఆత్మీయంగా కౌగిలించుకుని, ఆయన సాధించిన ఘనతను అభినందించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 18 రోజుల పాటు గడిపి, అనేక శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించిన శుక్లా, తన అంతరిక్ష ప్రయాణంలోని అనుభవాలను ప్రధానికి వివరించారు.

అంతరిక్షంలో ఉన్నప్పుడు శుక్లా జూన్ 29న ప్రధాని మోదీతో వర్చువల్‌గా మాట్లాడారు. ఆ సమయంలో మోదీ ఆయనకు అంతరిక్షంలో తాను నేర్చుకున్న ప్రతి విషయాన్ని, ప్రయోగాలు, అక్కడి వాతావరణాన్ని క్షుణ్ణంగా నమోదు చేయాలని సూచించారు. ఈ సమాచారం భవిష్యత్తులో భారతదేశం నిర్వహించబోయే గగన్‌యాన్ మిషన్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని మోదీ అన్నారు. శుక్లా, మోదీకి ఇచ్చిన త్రివర్ణ పతాకం ఐఎస్ఎస్ లో ఆయన మోదీతో మాట్లాడినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించింది. ఈ జెండా భారతదేశ మానవ అంతరిక్ష ప్రయోగాల కొత్త శకానికి ప్రతీకగా నిలిచింది. ఈ భేటీ తర్వాత, ప్రధాని మోదీ తన 'ఎక్స్' ఖాతాలో శుక్లాతో సంభాషణ అద్భుతంగా సాగిందని, ఆయన అంతరిక్ష అనుభవాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ పురోగతి, మరియు భారతదేశ గగన్‌యాన్ మిషన్ గురించి చర్చించామని పేర్కొన్నారు. ఈ ఘనత సాధించినందుకు భారతదేశం గర్వపడుతోందని కూడా తెలిపారు. శుక్లా సాధించిన ఈ అరుదైన విజయం దేశ యువతకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రధాని కొనియాడారు.

Advertisment
తాజా కథనాలు