/rtv/media/media_files/2025/08/16/shubhanshu-shukla-2025-08-16-18-30-56.jpg)
shubhanshu shukla
భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ సుభాంషు శుక్లా ISS యాత్ర తర్వాత మొదటిసారిగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. విమానంలో చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫొటోను శుభాన్షు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. స్నేహితులు, కుటుంబ సభ్యులను కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అందులో రాసుకొచ్చారు.
As I sit on the plane to come back to India I have a mix of emotions running through my heart. I feel sad leaving a fantastic group of people behind who were my friends and family for the past one year during this mission. I am also excited about meeting all my friends, family… pic.twitter.com/RGQwO3UcQr
— Shubhanshu Shukla (@gagan_shux) August 16, 2025
రేపు(ఆదివారం) భారత్‌లో ల్యాండ్ కానున్నారు. సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని శుభాన్షు కలిసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు ఆగస్టు 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నాయి. ఆక్సియం-4 మిషన్ ద్వారా శుభాన్షు ఇటీవలే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే.
This is the one year journey of Axiom 4 mission compressed into a few minutes. This mission has been so much to me personally. But what came after was even more special. The love and support showered by each one of you. I can't be more grateful.
— Shubhanshu Shukla (@gagan_shux) August 1, 2025
This mission alongside… pic.twitter.com/BJvHvJgDfN
యాక్సియం-4 మిషన్‌లో శుక్లా బృందం 2025 జూన్‌లో ISSకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌కు శుక్లా చీఫ్ పైలట్‌గా వ్యవహరించారు. ఐఎస్‌ఎస్‌లో 18 రోజుల పాటూ గడిపిన ఆయన 60కిపైగా శాస్త్రీయ పరిశోధనల్లో పాల్గొన్నారు. శుభాన్షు బృందం జులై 15న క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది. ఇక అంతరిక్షంలోకి వెళ్లిన 2వ భారత వ్యోమగామిగా శుభాన్షు శుక్లా రికార్డు క్రియేట్ చేశారు. 1984లో సోవియట్ యూనియన్‌కు చెందిన ఇంటర్‌కాస్మోస్ మిషన్ కింద సూయజ్ టీ-11 వ్యోమనౌకలో భారత వ్యోమగామి రాకేశ్‌శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లి ఎనిమిది రోజులపాటు ఉండి తిరిగి వచ్చారు. తాజా ప్రయోగంతో 41 ఏండ్ల తర్వాత రోదసిలోకి వెళ్లి వచ్చిన రెండో భారతీయుడిగా శుభాన్షు రికార్డు సృష్టించారు. ఐఎస్‌ఎస్‌లోకి వెళ్లి వచ్చిన తొలి భారతీయుడు కూడా ఇతనే కావడం విశేషం.