AP: తెలుగులోనూ ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు– ఏపీ గవర్నమెంట్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రభుత్వ కార్యకలాపాల ఉత్తర్వులు అన్నీ ఇకపై తెలుగులో కూడా ఉండాలని ఏపీ గవర్నమెంట్ ఆదేశించింది. మొదటగా దీనికి సంబంధించిన ఉత్తర్వులనే ఇంగ్లీషు, తెలుగు రెండింటిలో జారీ చేసింది గవర్నమెంట్.