తెలంగాణలో మరో ఎన్నిక.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ ను విడుదల చేసింది ఎన్నికల కమిషన్. ఈ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ను మే 2న విడుదల చేయనున్నారు. ఎన్నిక మే 27న జరగనుంది.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ ను విడుదల చేసింది ఎన్నికల కమిషన్. ఈ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ను మే 2న విడుదల చేయనున్నారు. ఎన్నిక మే 27న జరగనుంది.
అమరవీరుల స్థూపం వద్దకు రాజీనామా పత్రంతో నేను వస్తా... దమ్ముంటే నువ్వు వస్తావా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. మెదక్ లో ఈ రోజు నిర్వహించిన రోడ్ షో లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సిద్దిపేటలో ఈ రోజు నిర్వహిస్తున్న బీజేపీ బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా హాజరయ్యారు. మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలుపు కోసం అమిత్ షా రంగంలోకి దిగడంతో పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి నెలకొంది. ఈ మీటింగ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
నిజామాబాద్ బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ, బహిరంగ సభను ఏర్పాటు చేసింది బీజేపీ. భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులతో నిజామాబాద్ కాషాయమయమైంది. లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
స్టార్ హీరో రణ్బీర్ కపూర్ యానిమల్ తర్వాత రామాయణంలో రాముడు పాత్రలో తెర పై కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం రణ్బీర్ కపూర్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అతని జిమ్ ట్రైనర్ రాముడి లుక్ కోసం రణబీర్ కపూర్ 3 సంవత్సరాల కష్టానికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.
తెలంగాణలో పెండింగ్ లో ఉంచిన మూడు ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఖమ్మం అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ అభ్యర్థిగా వసీఉల్లా సమీర్ పేర్లను ప్రకటించింది.
TG: కేసీఆర్కు పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లాలో వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్ కు ప్రమాదం జరిగింది. ఒకదానికొకటి వాహనాలు ఢీకొన్నాయి. 8 వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో కేసీఆర్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
కోటక్ మహీంద్రా బ్యాంక్ కు రిజర్వ్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. నూతన క్రెడిట్ కార్డుల జారీని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంకా.. ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ మార్గాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని స్పష్టం చేసింది ఆర్బీఐ.