తెలంగాణలో మరో ఎన్నిక.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ ను విడుదల చేసింది ఎన్నికల కమిషన్. ఈ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ను మే 2న విడుదల చేయనున్నారు. ఎన్నిక మే 27న జరగనుంది.

New Update
Election Commission: ఈసీ సంచలన నిర్ణయం.. పోలింగ్ సమయం పెంపు

వరంగల్ - ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది ఎన్నికల కమిషన్. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను మే 2న విడుదల చేయనున్నారు. నామినేషన్లను ఆ రోజు నుంచి 9వ తేదీ వరకు స్వీకరించనున్నారు. నామినేసన్ల పరిశీలన మే 10న ఉంటుంది. నామినేషన్ల విత్ డ్రాకు మే 13 లాస్డ్ డేట్. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నిక నిర్వహిస్తారు. కౌంటింగ్ జూన్ 5న నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు.
ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణలో మే 13న సెలవు.. సీఈవో కీలక ప్రకటన..!

పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో..
ఈ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగామా ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో గత డిసెంబర్ 9న ఆయన ఎమ్మెల్సీగా రాజీనామా చేశారు. వాస్తవానికి ఈయన పదవీకాలం 2027 మార్చి 29 వరకు ఉంది. కానీ.. ఆయన రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ.
publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు