/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Congress-MP-jpg.webp)
Telangana Congress MP Final List: తెలంగాణలో పెండింగ్ లో ఉంచిన మూడు ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఖమ్మం అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ అభ్యర్థిగా వసీఉల్లా సమీర్ పేర్లను ప్రకటించింది. కాగా ఖమ్మంలో ఊహించని పేరును ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో మంత్రి పొంగులేటి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్ హనుమంతరావు ఉండగా.. వీరందిరిని కాదని తెర పైకి కొత్త పేరును కాంగ్రెస్ అధిష్టానం తెర పైకి తెచ్చింది. అలాగే కరీంనగర్ ఎంపీ టికెట్ తనకే వస్తుందని ఆశగా ఉన్న ప్రవీణ్ రెడ్డి కి హస్తం పార్టీ హ్యాండ్ ఇచ్చింది.