Omen Chandy Funeral నేడు కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ అంత్యక్రియలు..!!
కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ అంత్యక్రియలు నేడు జరగున్నాయి. ఆయన పార్థివదేహాన్ని బుధవారం తిరువనంతపురం నుంచి కొట్టాయంలోని ఆయన స్వగ్రామానికి తరలించారు.
కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ అంత్యక్రియలు నేడు జరగున్నాయి. ఆయన పార్థివదేహాన్ని బుధవారం తిరువనంతపురం నుంచి కొట్టాయంలోని ఆయన స్వగ్రామానికి తరలించారు.
ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని ఏపీ ఐఎండీ ప్రకటించింది. ఐఎండీ అంచనా ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరం ఆనుకుని ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
రాగల మూడు, నాలుగురోజుల పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిస్తూ తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రెండు మూడు రోజులుగా ఆగకుండా ముసురు పడుతుండగా... ఇవాళ్టి నుంచి మరో మూడురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడటంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
దివంగత నేత రాంవిలాస్ పాశ్వన్...2021లో మరణించారు. ఆయన స్థాపించిన లోక్ జనశక్తిపార్టీ రెండుగా చీలిపోయిది. ఆయన కుమారుడి, సోదరుడికి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో తమ్ముడు పశుపతి కుమార్ పరాస్ పార్టీని రెండుగా చీల్చాడు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే వీరిద్దర్నీ ఒకటి చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చాలానే చేసింది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి మేనల్లుడు, మేనమామ ఇద్దరూ హాజరయ్యారు. మేనమామ పాదాలను తాగి..కౌగిలించుకున్నాడు చిరాగ్ పాశ్వాన్.
ఎన్డీయే, INDIA మిత్రపక్షాల భేటీలు ముగిశాయి. ఎన్డీయేకి 38పార్టీల మద్దతుండగా.. INDIAకి 26పార్టీల సపోర్ట్ ఉంది. ఎన్డీయేకి ప్రస్తుతం 332మంది ఎంపీల బలముండగా.. INDIAకి 114ఎంపీల బలముంది.
నలుపు రంగంటే చాలా మందికి నచ్చదు. కానీ నలుగు రంగులో ఉండే ఆహారం ఆరోగ్యానికి ఎన్నివిధాల మేలు చేస్తాయో తెలుస్తే మీరు ఆశ్చర్యపోతారు. నలుపు ఎండు ద్రాక్ష, పొద్దుతిరుగుడు విత్తనాలు, నల్లనవ్వులు, అత్తిపండ్లు, నల్లద్రాక్ష వీటన్నింటిలో బోలెడన్నీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాపడుతాయి. ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్న వీటితో కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జమ్మూకశ్మీర్‌లో (Jammu and Kashmir) భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశాయి భద్రతా బలగాలు. పూంచ్ సెక్టార్ లోకి నలుగురు విదేశీ ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించగా సైన్యం వారిని మట్టుబెట్టాయి. జూలై 16.17 మధ్య రాత్రి పూంచ్ లో నియంత్రణ రేఖ వెంబడి సైన్యం చొరబాటు ప్రయత్నాన్ని అడ్డుకున్నాయి. ఒక రోజు తర్వాత జరిగిన ఈ ఎన్ కౌంటర్లలో నలుగురు టెర్రరిస్టులను హతమార్చింది సైన్యం.
ఐపీఎల్లో రాజస్థాన్, పంజాబ్ తరుఫున ఆడిన పాల్ వాల్తాటి క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011లో చెన్నై సూపర్ కింగ్స్‌పై సెంచరీతో లైమ్ లైట్లోకి వచ్చిన వాల్తాటి ధోనీ చేత ప్రసంశలు అందుకున్న అతి కొద్దిమంది బ్యాటర్లలో ఒకరు.
ఈసారి ఎన్డీఏ కూటమి 50శాతానికి పైగా ఓట్ల మెజార్టీ సాధిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 2024లో పూర్తి మెజార్టీతో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మా మిత్రపక్షాలు దేశవ్యాప్తంగా బలపడుతున్నాయన్న మోడీ...ఎన్డీఏ కెమిస్ట్రీ, హిస్టరీ ప్రజలకు బాగా తెలుసన్నారు.