ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన నిర్మాత.. కారణం ఇదే!
నిర్మాత నాగ వంశీ.. 'దేవర' సక్సెస్ మీట్ క్యాన్సిల్ అయిందని పోస్ట్ పెట్టాడు. ఈ ఈవెంట్‌ను భారీగా నిర్వహించాలని అనుకున్నప్పటికీ అనుమతులు లభించలేదని తెలిపారు. సక్సెస్ మీట్‌ను నిర్వహించలేకపోతున్నందుకు అభిమానులను క్షమాపణలు కోరారు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.