'దేవర' లో మీరు చూసింది 10 శాతమే.. అసలు కథ పార్ట్2 లోనే : కొరటాల శివ

కొరటాల శివ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘దేవర 2’ గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. పార్ట్‌-1 లో మీరు చూసింది 10 శాతమే. రెండో భాగంలో 100 శాతం చూస్తారు. కథలో అసలు మలుపు పార్ట్‌ 2లోనే ఉంది. ప్రతీ పాత్రలో ట్విస్ట్‌ ఉంటుంది. ఈ విషయంలో ప్రామిస్‌ చేస్తున్నానని అన్నారు.

New Update
devr2

మ్యాన్ ఆఫ్ మాసెస్  జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరెకెక్కిన 'దేవర' మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం 10 రోజుల్లోనే రూ.460 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సక్సెస్ ను అటు మూవీ టీమ్, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. 

కాగా 'దేవర' కు కొనసాగింపుగా పార్ట్-2 ఉంటుందని కొరటాల శివ అండ్ టీమ్ గతంలోనే క్లారిటీ ఇచ్చారు. అలాగే 'దేవర' లో ఎన్నో ప్రశ్నలను వదిలేసి పార్ట్ 2 పైఅంచనాలు పెంచారు. తాజాగా కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘దేవర 2’ గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు." దేవర పార్ట్ 2లో జాన్వీ పాత్ర పవర్ ఫుల్ గా కూడా ఉంటుంది. జాన్వీ పాత్రని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. 

అసలు కథ పార్ట్-2 లోనే..

మొదటిభాగం కంటే రెండోభాగం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. సినిమా చూసే ప్రేక్షకులు సీట్‌ ఎడ్జికి వస్తారు. ఒక దర్శకుడిగా నేను పార్ట్‌ 2 విషయంలోనూ ఎంతో నమ్మకంగా, ఆసక్తిగా ఉన్నాను. కథలో అసలు మలుపు పార్ట్‌ 2లోనే ఉంది. ప్రతీ పాత్ర హైలో ఉంటుంది. ఎన్టీఆర్‌ అభిమానులందరికీ ఒక్కటే చెబుతున్నా.. పార్ట్‌-1 లో మీరు చూసింది 10 శాతమే.. రెండో భాగంలో 100 శాతం చూస్తారు.

ఇదే నా ప్రామిస్..

ప్రతీ పాత్రలో ట్విస్ట్‌ ఉంటుంది. కొన్ని సన్నివేశాలు మీరు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి. ఈ విషయంలో ప్రామిస్‌ చేస్తున్నాను. తారక్‌ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అతడు తన పాత్రకు జీవం పోస్తాడు.." అంటూ చెప్పుకొచ్చాడు. కొరటాల కామెంట్స్ తో పార్ట్ - 2 అంచనాలు తారా స్థాయికి చేరాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు