రాజేంద్రప్రసాద్‌కు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ప్రగాఢ సానుభూతి.. పోస్ట్ వైరల్

రాజేంద్రప్రసాద్ కూతురి మరణంపై పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ సానుభూతి తెలిపారు. "రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి మరణం విషాదకరం." అని ఎన్టీఆర్, ''శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది."అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

New Update
Rajendra Prasad

నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంపై పలువురు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. గాయత్రి మరణం పట్ల రాజేంద్ర ప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

గాయత్రి మరణం విషాదకరం

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ''నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారి మరణం చాలా విషాదకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారికి, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అంటూ రాసుకొచ్చాడు. 

గాయత్రి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది

గాయత్రి మరణంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. '' ప్రముఖ నటులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె శ్రీమతి గాయత్రి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది. శ్రీమతి గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యాన్ని శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను" అని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

#ap-deputy-cm-pawan-kalyan #ntr #rajendra-prasad
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు