'దేవర' హిట్టు బొమ్మ.. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్, తారక్ చెప్పిందే నిజమైంది

'దేవర' సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయినట్లు సమాచారం. ఈ మూవీ వరల్డ్ వైడ్ 180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 360 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాలి. తాజాగా ఈ మూవీ 396 కోట్లు కలెక్ట్ చేయడంతో అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది.

New Update
devra ntr

'మీరంతా కాలర్ ఎగరేసేలా 'దేవర' సినిమా ఉంటుంది.. సినిమా చూసి మీరంతా కాలర్ ఎగరేస్తారు, ఇదే నా ప్రామిస్'.. 'టిల్లు స్క్వేర్' సక్సెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్.. ఫ్యాన్స్ తో చెప్పిన మాట ఇది. ఈ ఒక్క మాటతో సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరాయి. సెప్టెంబర్ 27 సినిమా రిలీజయింది. తారక్ చెప్పిందే జరిగింది. ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. 

దాంతో సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ నిజంగానే కాలర్ ఎగరేసుకుంటూ థియేటర్స్ నుంచి బయటికొచ్చారు. ఇక నార్మల్ ఆడియన్స్ నుంచి మాత్రం రిలీజ్ రోజున మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ తర్వాత రోజు నుంచి టాక్ మారుతూ వచ్చింది. దాంతో కలెక్షన్స్ పెరిగాయి. తాజాగా సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయినట్లు సమాచారం. అదికూడా వారం రోజుల్లోనే జరగడం విశేషం.  

హిట్టు బొమ్మ..

దేవర మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా నిన్నటి వరకు అంటే రిలీజయిన ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.396 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా నేడు ప్రకటించింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ రూ.180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం రూ.360 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాలి. ఇప్పటికి రూ.396 కోట్లు కలెక్ట్ చేయడంతో అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది.

అంటే 'దేవర' హిట్టు బొమ్మ అనే విషయం స్పష్టమవుతోంది. దీంతో ఎన్టీఆర్ చెప్పిందే నిజమైందని, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ అంతా మరోసారి కాలర్ ఎగరేసే సమయం ఇదని అభిమానులు నెట్టింట వరుస పోస్టులు పెడుతున్నారు.  మరోవైపు  ఇవాళ్టి నుంచి దసరా సెలవులు కూడా ఉండటంతో కలెక్షన్స్ నేటి నుంచి మరింత పెరిగే అవకాశం ఉందని మూవీ యూనిట్ భావిస్తున్నారు. దసరా పండగ వరకు సినిమా కచ్చితంగా 500 కోట్ల క్లబ్ లో చేరడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు