/rtv/media/media_files/2025/07/01/father-killed-his-son-with-wood-in-ntr-district-2025-07-01-14-48-09.jpg)
Crime News
నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గురువారం పెళ్లి జరగనుండగా.. వరుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మంగల్‌పహాడ్ గ్రామంలో ప్రతాప్ గౌడ్ అనే వ్యక్తి ఉంటున్నాడు. 13వ తేదీన తల్లిదండ్రులు ఇతనికి వివాహం కుదిర్చారు. పెళ్లి వేడుకలతో ఎంతో సందడిగా ఉండాల్సిన ఇళ్లు.. అతని మృతితో శోక సంద్రమైంది. పెళ్లి చేసుకుని ఎంతో అందమైన జీవితాన్ని గడపాల్సిన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెళ్లికి ఒక రోజు ముందు ఆ యువకుడు ఇలా ఆత్మహత్మ చేసుకోవడానికి ముఖ్య కారణం కుటుంబ కలహాలే అని తెలుస్తోంది. ఈ యువకుడు మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Delhi Bomb Blast: ఢిల్లీ బాంబు పేలుడు.. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ!
పెళ్లయిన ఆరు నెలలకే..
ఇదిలా ఉండగా.. గతేడాది డిసెంబరు 6న చోడవరం మండలం గోవాడ పంచాయతీకి చెందిన వేపాడ దిలీప్ శివకుమార్‌తో అచ్యుతాపురం వాసి విజయశ్యామల (25)కు వివాహమైంది.పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు సమర్పించారు. ఉద్యోగరీత్యా దిలీప్, శ్యామల గత కొన్ని నెలలుగా రామకృష్ణనగర్‌లో నివాసం ఉంటున్నారు. దిలీప్ శివకుమార్ గత కొద్ది నెలలుగా అదనపు కట్నం కోసం శ్యామలను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. భర్త ఇంట్లో లేని సమయం చూసి, ఆదివారం అర్ధరాత్రి శ్యామల ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో పశ్చిమ ఏసీపీ పృధ్వీతేజ్, స్థానిక సీఐ లెంక సన్యాసినాయుడు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఇది కూడా చూడండి: Crime News: ఏపీలో కిడ్నీ రాకెట్.. ప్రాణం తీసిన దందా... రూ.8 లక్షలతో గుట్టు రట్టు!
Follow Us