Nirmala Seetharaman: దేశ విభజన వ్యాఖ్యలపై నిర్మలా ఫైర్.. ఏమన్నారంటే నిధుల కేటాయింపు విషయంలో సౌత్ ఇండియా ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ వస్తుందని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్ దేశంలో ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని మండిపడ్డారు. By B Aravind 29 Feb 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి బడ్జెట్ కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగితే.. సౌత్ ఇండియా ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేసే పరిస్థితి వస్తుందని ఇటీవల కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె బడ్జెట్ నిధుల కేటాయింపుపై క్లారిటీ ఇచ్చారు. నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం.. ఫైనాన్స్ కమిషన్‌కు కట్టుబడి ఉందని అన్నారు. Also Read: మార్చిలో బ్యాంకులకు 14 రోజుల పాటు సెలవులు.. అలర్ట్! కమిషన్‌ను సంప్రదించాల్సిందే ఒకవేళ నిధులు కావాలనుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వాలు ఫైనాన్స్ కమిషన్‌కు తమ సమస్యలను చెప్పాల్సి ఉంటుందని తెలిపారు. ఇలా చేస్తే ఆయా రాష్ట్రాలకు నిధులు మంజూరు అవుతాయని పేర్కొన్నారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో బలం ఉంటుందని.. అందుకే దక్షిణాది రాష్ట్రాలను వేరుగా పరిగణించలేమన్నారు. ఇలా ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్ దేశంలో ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌత్ రాష్ట్రాలు ఇండెక్స్‌లో మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయని.. అలాంటప్పుడు రాష్ట్రానికి నిధులు ఎక్కువగా అవసరమైతే.. కమిషన్‌ను సంప్రదించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒక్కటిగా ఉంచడమే కాంగ్రెస్ సిద్ధాంతం మీరు ఓ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి.. దేశ విభజనను డిమాండ్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్‌పై విమర్శలు చేశారు. అయితే ఇటీవల ఈ అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. డీకే సురేష్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున దీనిపై స్పందించారు. దేశాన్ని ఒక్కటిగా ఉంచాలనేదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని.. దేశ విభజన కోరుకునేవారికి తమ పార్టీ ఎప్పుడు మద్దతు తెలపదని అన్నారు. Also Read: 2028లో చంద్రయాన్ -4 ప్రయోగం చేపట్టనున్న ఇస్రో #dk-suresh #bjp #national-news #nirmala-seetharaman #telugu-news #congress #budget మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి