మేకోవర్ అద్భుత సృష్టీ.. పింక్ బార్బీ లుక్లో మోదీ, సోనియా, రాహుల్
గ్లోబల్వైడ్గా ప్రస్తుతం మనకు వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI). ఈ టెక్నాలజీ అద్భుతమైన పనులు చేస్తూ ఎంతగానో పాపులర్ అయ్యింది. ఈ టెక్నాలజీని ఉపయోగించి అన్నిరకాల ఫోటోలను మారుస్తూ సోషల్మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో పెట్టిన కొన్నిగంటల్లోనే ఈ ఫోటోలు ట్రెండింగ్ అవుతున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే తమకిష్టమైన నాయకులు, హీరోలు, హీరోయిన్లు ఇలా రకరకాల ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి మార్చుతున్నారు. తాజాగా ఇదే కోవలోకి రాజకీయ నేతలు వచ్చి చేరారు.ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.