MS Dhoni : హ్యాపీ బర్త్ డే మిస్టర్ కూల్.. మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక సారథి!
భారత మాజీ క్రికెటర్ ధోనీ నేడు తన 43వ బర్త్‌డే జరుపుకుంటున్నాడు. దూకుడు బ్యాటింగ్‌తో టీమిండియాలోకి దూసుకొచ్చి భారత జట్టు వెన్నెముకగా మారాడు. తొలి టీ 20 ప్రపంచకప్, రెండో వన్డే ప్రపంచకప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలు అందించిన ఏకైక భారత కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోయాడు.