Dhoni Retairment: ఎంఎస్ ధోనీ.. ఇప్పటి క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. భారత క్రికెట్ జట్టుకు ఒక జోష్ తీసుకువచ్చిన స్టార్ క్రికెటర్. ధోనీ ముందు.. ధోనీ తరువాత అని ఇప్పటి క్రికెట్ గురించి మాట్లాడుకునేలా చేసిన కీపర్. చిరుత వేగంతో చేసే స్టంపింగ్స్.. స్టేడియం అవతల పడేలా బంతిని కొట్టే హెలికాఫ్టర్ స్టైల్ బ్యాటింగ్.. మిన్ను విరిగి మీద పడినా చలించని నైజం.. ఇవన్నీ ధోనీ కి మాత్రమే సాధ్యం. ఒక్కసారి టీమ్ జెర్సీ వేసుకున్నాకా.. గెలుపే లక్ష్యంగా పోరాడే స్ఫూర్తిని సహచరుల్లో నింపగలిగే నాయకత్వ పటిమ ధోనీ సొంతం. టీమిండియా కోసం ఆడిన ఆట ఒక ఎత్తైతే.. ఐపీఎల్ లో చెన్నై జట్టు కెప్టెన్ గా ఆటగాడిగా ధోనీ పాత్ర మరింత విశిష్టమైనది. ఐపీఎల్ లో చెన్నై జట్టును ఎవరికీ అందనంత ఎత్తుగా కూచోపెట్టిన ఘనత ధోనీదే అనడంలో సందేహం అక్కరలేదు. అయితే.. ఎంతటి వారైనా.. చివరికి పక్కకి జరగాల్సిందే కదా. ధోనీ అంతర్జాతీయ మ్యాచ్ ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నపుడు ఎక్కడా కూడా తన నుంచి భావోద్వేగ స్పందన లేదు. క్రికెట్ ఆడేటప్పుడు ఎంత కూల్ గా ఉంటాడో అంతే కూల్ గా అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు. అభిమానులు కలవర పడ్డారు కానీ, ధోనీ ఎక్కడా ఇబ్బంది పడినట్టు కనిపించలేదు. పైగా.. ఎవరైనా వెళ్లాల్సి వచ్చినపుడు గౌరవంగా వెళ్ళిపోవాలి అనే తత్వమే కనిపించింది.
పూర్తిగా చదవండి..Dhoni Retairment: ఎన్నెన్నో అనుకుంటాం.. ధోనీ కోరిక తీరలేదు..అభిమానుల ఆశలు చావలేదు..
చెన్నైలో చివరి మ్యాచ్ ఆడాలనేది ధోనీ కోరిక. అయితే, ఆర్సీబీ పై ఓడిపోవడంతో చెన్నై కి మరో మ్యాచ్ ఆడే ఛాన్స్ లేదు. ఇప్పుడు ధోనీ ఏం చేస్తాడు అనేది పెద్ద ప్రశ్న. మరో పక్క అభిమానులు మాత్రం ధోనీ రిటైర్ అవ్వకూడదనీ.. వచ్చే ఐపీఎల్ లో చెన్నైలోనే వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నారు
Translate this News: