JAAT: బాలీవుడ్లో జానీ మాస్టర్ హవా.. ఊర్వశీకి పవర్ ఫుల్ కొరియోగ్రఫీ.. కిక్కే కిక్కు!
సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబోలో ‘జాట్’ మూవీ రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి తొలి సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టచ్ కియా అంటూ సాగే ఈ సాంగ్‌లో ఊర్వశీ రౌతేలా చిందేశారు. జానీ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది.