Modi: మోదీ ప్రమాణ స్వీకారం..🔴 Live Updates
భారత ప్రధాన మంత్రిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ ఫోర్ కోర్ట్ వేదికగా ఆదివారం సాయంత్రం మోదీతో పాటు మరో 71 మంది ఎంపీలు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
భారత ప్రధాన మంత్రిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ ఫోర్ కోర్ట్ వేదికగా ఆదివారం సాయంత్రం మోదీతో పాటు మరో 71 మంది ఎంపీలు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈనెల 9వ తేదీన జరిగే మోదీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాల ప్రముఖులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి భవన్కు రక్షణగా ఐదు కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించడంతో పాటు బహుళ స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈసారి ఎన్నికలు పెద్ద సంచలనం. ఓటర్లు తమకు నచ్చినవారికి ఓటు వేసి లౌకికత్వాన్ని చాటుకున్నారు. రాజకీయాలకు, మతాలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఓటర్లు తమలో ఉన్న రాజకీయ పరిపక్వతను చాటుకున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన భార్య, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఎన్డీఏ కూటమి సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన పవన్ అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో పవన్ తన కుటుంబాన్ని మోదీకి పరిచయం చేశారు.
మూడోసారి భారత ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణం చేయనున్నారు. నెహ్రూ తర్వాత ఈ ఘనతను సాధించింది మోదీ మాత్రమే. అందుకే ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనంగా చేయాలనుకుంటున్నారు. దీని కోసం విదేశీ నేతలకు ఆహ్వానాలు పంపనున్నారు.
ఇండియా కూటమి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. లోక్సభలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని నిర్ణయించుకుంది. బుధవారం మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు సమావేశం కాగా వారంతా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్ర మోడీపై ఈటల రాజేందర్ ప్రశంసలు కురిపించారు. నెహ్రూ తర్వాత వరుసగా 3వ సారి ప్రధాని పదవి చేపట్టే ఘనత మోడీకే దక్కిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అన్నారు.
లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిచారు. ఈసారి ఎన్నికలు మోదీ వ్యతిరేక తీర్పును ఇచ్చాయని భావిస్తున్నామని.. నైతికంగా ఇది మోదీ ఓటమి అని అన్నారు. ప్రజాతీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నామని స్పష్టం చేశారు.
యూపీలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ 42కిపైగా స్థానాల్లో లీడింగ్తో దూసుకెళ్తోంది. వారణాసిలో ప్రధాని మోడీ వెనుకంజలో ఉండడం గమనార్హం. కాగా కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ మోడీకంటే ముందంజలో ఉన్నారు.