Medaram Jathara: మేడారం హుండీ లెక్కింపు.. బయటపడ్డ 100 రూపాయల అంబేడ్కర్ నోటు
మేడారం మహాజాతర హుండీ లెక్కింపులో నకిలీ కరెన్సీ నోట్లు రావడం కలకలం రేపింది. ఓ హుండీలో అంబేడ్కర్ ఫొటోతో నకిలీ రూ.100 నోట్లు కనిపించాయి. భారత కరెన్సీపై అంబేడ్కర్ ఫోటోను ముద్రించాలన్న డిమాండ్తో ఆ నోట్లను కొందరు హుండీలో వేసినట్లుగా అధికారులు భావిస్తున్నారు.