Ganapathi : మావోయిస్టు దళపతి గణపతి లొంగుబాటు ?

మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి కేంద్ర ప్రభుత్వం ముందు లొంగిపోవడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు ఇచ్చిన సమాచారం మేరకు దళపతి గణపతి అచూకీ తెలంగాణ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తుంది. మరి కొన్నిగంటల్లో గణపతి లొంగిపోనున్నారు.

New Update
FotoJet (6)

Maoist top leader Ganapathi surrenders?

Ganapathi : మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి కేంద్ర ప్రభుత్వం ముందు లొంగిపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి తదితరులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్రనేత గణపతి అచూకీ తెలంగాణ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తుంది. వృద్ధాప్యంతో నేపాల్ లో తలదాచుకుంటున్న గణపతిని ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే గణపతిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సరెండర్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికోసం ఆయన ఈ రోజు సాయంత్రం హుటాహుటినా ఢిల్లీకి వెళ్లారు. ఆయన వెంట డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ హెడ్ సుమతి, అదనపు డీజీపీ విజయ్ కుమార్ తదితరులు కూడా ఉన్నారు. కాగా మార్చి 31న ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ గా పెట్టుకోవడంతో పాటు మావోయిస్టులను అంతం చేస్తామన్న అమిత్ షా నిర్ణయానికి  నాలుగు వారాల ముందే గణపతి పోలీసులకు అందుబాటులోకి రావడం గమనార్హం.కాగా గణపతి ఆచూకీ కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించి ఆయనను ఢిల్లీకి తీసుకువస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
 
నాలుగున్నర దశాబ్దాల అజ్ఞాతానికి ముగింపు

తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గణపతి ఉన్నత విద్యావంతుడు. ఆయన వరంగల్‌లో బీ.ఈడీ శిక్షణ తీసుకుంటున్న సమయంలో 1983లో నాటి పీపుల్స్ వార్‌ పార్టీవైపు ఆకర్షితులై అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటి నుంచి ఆయన రహస్య జీవితంలోనే ఉండిపోయారు. ఆనాటి నుంచి ఆయన స్వగ్రామానికి గానీ,  తెలంగాణకుగానీ వచ్చిన సందర్భం లేదు. ఆయన కుటుంబ సభ్యలు మరణించినప్పుడు కూడా ఆయన ఇంటికి రాలేదు. అయితే అనతి కాలంలోనే పీపుల్స్ వార్ లో సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలో 1991లో నాటి ప్రధాన కార్యదర్శి కొండపల్లి సీతారామయ్యతో విభేధించారు. చివరకు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించి ప్రధాన కార్యదర్శి బాధ్యతలను గణపతి చేపట్టారు. అప్పటి నుంచి 2018 వరకు ఆయన ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఈ క్రమంలోనే పశ్చిమబెంగాల్‌కు చెందిన ‘పార్టీ యూనిటీ’ , బిహార్‌కు చెందిన ‘మావోయిస్టు కమ్యూనిటీ సెంటర్’ (ఎంసీసీ) లు పీపుల్స్ వార్ లో విలీనం కావడంతో సీపీఐ (ఎం-ఎల్) పీపుల్స్ వార్ ఆ తర్వాత సీపీఐ (మావోయిస్టు)గా రూపాంతరం చెందింది. సుదీర్ఘకాలం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన గణపతి ఆ తర్వాత అనారోగ్య కారణాలతో ప్రధాన కార్యదర్శిగా తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఇటీవల ఎన్ కౌంటర్ లో మరణించిన నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు బాధ్యతలు నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా లేకున్నా పోలిట్‌బ్యూరోలో జరిగే చర్చలన్నింటిలో పాల్గొంటూ వ్యూహం, ఎత్తుగడలు లాంటి కీలక నిర్ణయాల్లో యాక్టివ్‌గా ఉండేవారు. ఆ తర్వాత తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆయన నేపాల్‌లో తలదాచుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆపరేషన్ కగార్ తో పార్టీ అంతం

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది.మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలెందరోఎన్‌కౌంటర్లలో చనిపోయారు. మార్చి 31 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటనను నిజం చేస్తూ వందలాది మంది నాయకులు ఎదురుకాల్పుల్లో చనిపోయారు. దీంతో పార్టీలో ఉన్న కీలక నేతలు లొంగుబాట పట్టారు. దీంతో గణపతి ఏకాకిగా మిగిలిపోయారు. ఇటీవల లొంగిపోయిన అగ్రనేతల సమచారంతో నేపాల్ లో ఉన్న గణపతిని తెలంగాణ పోలీసలు సురక్షితంగా ఢిల్లీకి తీసుకువస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన లొంగుబాటును ఈ రోజు లేదా మరో రెండు మూడు రోజుల్లో చూపించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మరికొన్ని గంటల్లో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా గణపతి లొంగుబాటును చూపించనున్నట్లు సమాచారం.  

గణపతి లొంగుబాటుతో ముగిసిన మావోయిస్టు శకం

50 ఏళ్ల పాటు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిన గణపతి అసలు పేరు ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు. ఆయనది ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం జగిత్యాల) సారంగపూర్ మండలంలోని బీర్ పూర్ గ్రామం. 1949లో జన్మించారు.
సుమారు 77 ఏండ్ల ఆయన జీవితకాలంలో నాలుగున్నర ఏండ్లు ఆయన ఆజ్ఞాతంలోనే ఉన్నారు. ఆపరేషన్ కాగర్ తర్వాత  అజ్ఞాతంలోకి వెళ్లిన గణపతి అనారోగ్య కారణాలతో నేపాల్ లో ఆశ్రయం పొందుతున్నట్లు ప్రచారం జరిగింది.  గణపతి లొంగుబాటుతో మావోయిస్టులో అగ్ర నేతల శకం ముగిసినట్లే.

సాయుధ పోరాటానికి ముగింపు

వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో ఆయన తెలంగాణ పోలీసులతో రహస్య సంప్రదింపులు జరుపుతున్నట్లు, త్వరలోనే లొంగిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. దశాబ్దాల పాటు సాయుధ మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన గణపతి,  వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణ జీవితం గడపాలని కుటుంబ సభ్యులు  కోరిక మేరకు జనజీవన స్రవంతిలోకి రానున్నారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆయనతో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం.గణపతి లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా, వారి సాయుధ పోరాట ముగింపునకు దారితీసే పరిణామంగా నిపుణుల భావిస్తున్నారు.

ఆయన భార్య ఆచూకీ ఎక్కడ?

పీపుల్స్ వార్ నుంచి సీపీఐ మావోయిస్టుగా మారిన తర్వాత మొదటి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గణపతి అనేక ఏండ్లపాటు ఆ హోదాలో ఉన్నారు. గణపతి పర్యవేక్షణలో దేశంలో సంచలన దాడులు జరిగాయి. మావోయిస్టు నెట్వర్క్ విస్తరణలో గణపతిది కీలక పాత్ర. అయితే మావోయిస్టు పార్టీలో షార్ట్ కట్ లో పార్టీలో ఎదిగాడన్న వాదన కూడా లేకపోలేదు. ఉద్యమంలో గణపతిని టీచర్ అని పిలిచేవారు.1970లో రైతు పోరాటాలు, జగిత్యాల  జైత్రయాత్ర ద్వారా పోరాటం చేసిన గుర్తింపు. నక్సస్ ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయి లీడర్ గా గణపతికి గుర్తింపు పొందారు. ఇప్పటికీ ఉద్యమంలో కొనసాగుతున్న గణపతి భార్య సుజాత ఆయనతో ఉందా లేదా అనేది స్పష్టత లేదు.

Advertisment
తాజా కథనాలు