Maharshtra: నాసిక్‌కు రెడ్ అలెర్ట్.. ఉగ్రరూపం దాల్చిన గోదావరి..!
మహారాష్ట్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. నాసిక్‌లో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రామ్‌కుండ్, గోదాఘాట్‌లోని ఆలయాలు నీట మునిగాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. వరదలకు 10 మంది మృతి చెందారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. నాసిక్‌కు IMD రెడ్ అలెర్ట్ జారీ చేసింది.