డబుల్ ఇంజిన్ అంటే ప్రధాని, అదాని.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడూతూ డబుల్ ఇంజిన్ అంటే ప్రధాని, అదానీ అంటూ విమర్శలు చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 17 Nov 2024 in నేషనల్ తెలంగాణ New Update షేర్ చేయండి మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఎన్నికల ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా షోలాపూర్‌లో ఆదివారం మీడియాతో మట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ''తెలంగాణలో మేం 50 వేల మందికి ఉద్యోగాలిచ్చాం. మహాయుతి కూటమి నాయకులు చూస్తానంటే వారందరినీ ఎల్‌బీ స్టేడియానికి పిలిపిస్తాం. 50 వేల మందికి ఒక్కరు తగ్గినా నేను క్షమాపణలు చెబుతాను. 50 వేల మంది ఉంటే మహాయుతి నాయకులు క్షమాపణలు చెబుతారా ?. ఇప్పటికీ మూడు సార్లు ప్రధాని అయినా మోదీ గ్యారంటీలపై మాట్లాడడం లేదు. ప్రధాని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటున్నారు. డబుల్ ఇంజిన్ అంటే ప్రధాని, అదానీ. ధారావిని అదానీకి దోచిపెట్టాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. కానీ దాన్ని మహారాష్ట్ర ప్రజలు తిప్పికొడతారు. Also Read: మహారాష్ట్రలో పవన్ ప్రచారం..తెలుగు, హిందీ, మహారాష్ట్రల్లో ప్రసంగం తెలంగాణలో మా ప్రభుత్వం కుల గణన చేపడుతోంది. దానిని పరిశీలించాలనుకుంటే ప్రధానమంత్రి ఒక టీమ్‌ను తెలంగాణకు పంపించవచ్చు. మోదీ తాను ముఖ్యమంత్రి అయ్యాక తన కులాన్ని ఓబీసీలోకి మార్పించుకున్నారని.. అందుకనే 2025లో దేశవ్యాప్తంగా చేపట్టే జన గణనలో కుల గణన కూడా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ మోడల్ దేశానికి తెలిస్తే గుజరాత్ మోడల్ విఫలమవుతుంది. Also Read: వరంగల్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై కీలక అప్‌డేట్.. 50 వేల మందిని తరలించిన గుజరాత్‌లో సబర్మతీ రివర్ ఫ్రంట్‌కు చప్పట్లు కొట్టి అభినందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో మాత్రం మూసీ పునరుజ్జీవన కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారు. కిషన్ రెడ్డి గుజరాత్‌కు గులాంగా మారారు. మహారాష్ట్రకు ఏక్ నాథ్ శిందే, అజిత్ పవార్ ఎలా విరోధులుగా మారారో కిషన్ రెడ్డి తెలంగాణలో అలా తయారయ్యారు. గంగా నది ప్రక్షాళన, సబర్మతీ రివర్ ఫ్రంట్ కిషన్ రెడ్డికి గొప్పగా కనిపిస్తోంది. అదే వ్యక్తి మూసీ పునరుజ్జీవనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నేతలు ఏం చేసినా తాము మూసీ పునరుజ్జీవనాన్ని పూర్తి చేస్తామని'' సీఎం రేవంత్ అన్నారు. #maharashtra #telugu-news #national-news #CM Revanth మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి