Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ అరెస్టు..

ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్‌స్టర్‌ అన్మోల్ బిష్ణోయ్‌ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న అన్మోల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

author-image
By B Aravind
New Update
Lawrence Bishnoi

ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్యలో గ్యాంగ్‌స్టర్‌ అన్మోల్ బిష్ణోయ్‌ కీలక పాత్ర పోషించాడని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న అన్మోల్‌ను అదుపులోకి తీసుకున్నారు. లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడే ఈ అన్మోల్ బిష్ణోయ్. లారెన్స్ బిష్ణోయ్ జైల్లో ఉండటంతో.. ఈ గ్యాంగ్‌ వ్యవహారాలు అన్మోల్‌ చూసుకుంటున్నారు. అయితే తాజాగా ఇతడు అరెస్టు కావడంతో బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.

Also Read: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం..107 విమాన సర్వీసులు ఆలస్యం!

Lawrence Bishnoi

ఇక వివరాల్లోకి వెళ్తే.. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్ అమెరికాలో ఉంటున్నట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా నుంచి రప్పించే ప్రక్రియను ఇక్కడి పోలీసులు ప్రారంభించారు. బాబా సిద్దిఖీ హత్య, అలాగే సల్మాన్‌ ఖాన్‌ ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనలో అన్మోల్‌ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి.  

Also Read: భార్యను ఉద్యోగం మానేయమని బలవంతం చేయడం క్రూరత్వమే!

 చివరికీ అన్మోల్ అమెరికాలో ఉన్నట్లు మహారాష్ట్ర పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడిని భారత్‌కు తీసుకొచ్చేందుకు అమెరికా ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలోనే అన్మోల్‌ ఆచూకి కనిపెట్టిన అమెరికా పోలీసులు తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. 

Also Read: లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్.. గిరిజనులను వేధిస్తే సహించేది లేదంటూ వార్నింగ్

ఇదిలాఉండగా..  అన్మోల్‌ బిష్ణోయ్‌ను అరెస్టు చేసేందుకు సహకరించిన వారికి రూ.10 లక్షల రివార్డు ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అతడిపై ఎన్‌ఐఏ దాఖలు చేసిన రెండు కేసులతో పాటు మరో 18 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. మరోవైపు ముంబయి కోర్టు కూడా అన్మోల్‌పై నాన్ బెయిలబుల్‌ వారెంట్‌ను కూడా జారీ చేసింది. 

Also Read: ఒకేసారి 99 మంది ఉద్యోగులను తీసేసిన CEO.. కారణం తెలిస్తే షాకే!

Advertisment
తాజా కథనాలు