BJP : రెండు రోజుల పాటు ఢిల్లీలో బీజేపీ జాతీయ మహా సభలు!
ఢిల్లీలో బీజేపీ రెండు రోజుల జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో రెండు రోజుల పాటు జరగనున్న బీజేపీ జాతీయ మహాసభల్లో దేశవ్యాప్తంగా 11,500 మంది ప్రతినిధులు పాల్గొంటారు.
ఢిల్లీలో బీజేపీ రెండు రోజుల జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో రెండు రోజుల పాటు జరగనున్న బీజేపీ జాతీయ మహాసభల్లో దేశవ్యాప్తంగా 11,500 మంది ప్రతినిధులు పాల్గొంటారు.
లోక్ సభ ఎన్నికల తరువాత ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి జైలు వెళ్లడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం సమంజసం కాదని అన్నారు.
మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, GHMC మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, ప్రొఫెసర్ బానోత్ రమణ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు దీపాదాస్ మున్షి.
తనకు రాజ్యసభ టికెట్ వస్తుందని కోటి ఆశలతో ఉన్న జానారెడ్డికి నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల్లో జానారెడ్డి పేరు లేదు. దీంతో జానారెడ్డి రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే జానారెడ్డి నల్గొండ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు.. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది. ఈ శాఖలో పనిచేస్తున్న 105 మంది అధికారుల్ని బదిలీ చేసింది.
ఇప్పుడు మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తంపై 8.25% వడ్డీని పొందుతారు. EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఈ రోజు అంటే శనివారం (ఫిబ్రవరి 10) దీనిని సిఫార్సు చేసింది. ప్రభుత్వ ఆమోదం తర్వాత ఇది అమలులోకి వస్తుంది.
లోకసభ ఎన్నికల్లో బెంగాల్లో ఒంటరి పోరుకు సిద్ధమన్నారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు కనీసం 40 స్థానాలు కూడా దక్కడం అనుమానమే అన్నారు.
పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న మమతా బెనర్జీ.. పార్లెమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపింది. తాజాగా ఆప్ కూడా పంజాబ్‌లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు అక్కడి సీఎం భగవంత్ మాన్ పేర్కొన్నారు.
త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మోడీ, కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతారని.. కానీ, తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ ప్రధాని కాలేడు కదా అని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు హరీష్ రావు. రెండు పార్టీలు ఒకటే అన్నారు.