Mamata Banerjee: వారణాసిలో గెలిచి సత్తా చూపించండి...లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 40 సీట్లు కూడా క‌ష్ట‌మే..!!

లోకసభ ఎన్నికల్లో బెంగాల్లో ఒంటరి పోరుకు సిద్ధమన్నారు తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు కనీసం 40 స్థానాలు కూడా దక్కడం అనుమానమే అన్నారు.

New Update
Budget 2024: ప్రజలను మోసగించిన బడ్జెట్‌- బెంగాల్ సిఎం మమత బెనర్జీ

Mamata Banerjee:  లోకసభ ఎన్నికల్లో బెంగాల్లో ఒంటరి పోరుకు సిద్ధంగా ఉన్నామన్న తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ..కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు కనీసం 40 స్థానాలు కూడా దక్కడం అనుమానంగా ఉందన్నారు. కాంగ్రెస్ మమతా విమర్శలతో విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు మరింత ముదిరేలా కనిపిస్తున్నాయి.

బెంగాల్లోని ముర్షిదాబాద్ లో శుక్రవారం జరిగిన బహిరంగసభలో మమతా బెనర్జీ మాట్లాడారు. 300సీట్లలో కాంగ్రెస్ కనీసం 40 స్థానాలైనా గెలుస్తారనేది అనుమానంగానే ఉందన్నారు. అలాంటిది మీకేందుకింత అహంకారమని మమతా నిలదీశారు.భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బెంగాల్లో అడుగుపెట్టినట్లు తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వయంత్రాంగం నుంచి తనకు ఈ విషయం తెలిసిందని దీదీ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: ఆ కంపెనీలో పెట్టుబడి పెడుతాను: ఆనంద్ మహీంద్రా

కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లో గెలిచే పరిస్థితిలేదని...అలహాబాద్, వారణాసిలో గెలిచి మీ పార్టీ సత్తా చూపించాలని కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. రాహుల్ బీడీ కార్మికులతో ఫొటో దిగిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక్కసారి కూడా టీ దుకాణానికి వెళ్లనివారు ఇప్పుడు బీడీ కార్మికులతో కూర్చుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు