Congress: పార్లమెంట్ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్!

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న మమతా బెనర్జీ.. పార్లెమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపింది. తాజాగా ఆప్ కూడా పంజాబ్‌లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు అక్కడి సీఎం భగవంత్‌ మాన్‌ పేర్కొన్నారు.

New Update
Congress Party : కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. మాజీ ఎమ్మెల్యే సస్పెండ్

Parliament Elections: మరికొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) జరగనున్న వేళ కాంగ్రెస్ పార్టీకి (Congress Party) ఎదురుదెబ్బ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ (BJP) ప్రభుత్వాన్ని గద్దె దించి కేంద్రం లో అధికారంలోకి రావాలనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమిలో (I.N.D.I.A Alliances) భాగంగా ఉన్న పార్టీలో ఊహించని షాకులు ఇస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో గద్దె దించేందుకు భారత్ లోని విపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆప్ పార్టీ (AAP) ఇండియా కూటమికి షాక్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌ రెడ్డిపై కేసు నమోదు

పొత్తుకు నో..

ఇండియా కూటమిలో భాగంగా ఉన్న ఆప్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పంజాబ్ లో (Punjab) ఒంటరిగా పోటీ చేయనున్నట్లు అక్కడి ఆప్ సీఎం భగవంత్‌ మాన్‌ (CM Bhagwant Mann) వెల్లడించారు. కాంగ్రెస్‌తో పొత్తు లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ తో పొత్తు లేకపోవడంతో ఈజీగా లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించవచ్చని బీజేపీ భావిస్తోంది.

దీదీ కూడా బై బై..

ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) షాక్‌ ఇచ్చారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని.. ఆ పార్టీతో పొత్తులు పెట్టుకోబోమని క్లారిటీ ఇచ్చారు.

‘ఇండియా కూటమిలో.. కాంగ్రెస్‌ సీట్ల పంపకంపై చర్చలు జరిపింది. కానీ అవి విఫలమయ్యాయి. మేము వారికి ఏ ప్రాతిపాదన ఇచ్చినా కూడా.. వాటన్నింటిని తిరస్కరించారు. మాకు కాంగ్రెస్‌తో ఎటువంటి సంబంధాలు లేవు.. పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోరాడతాం. ఎన్నికలు పూర్తయ్యాక అఖిల భారత స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని మమతా బెనర్జీ అన్నారు. అలాగే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్ర గురించి కూడా మాట్లాడారు. వాళ్లు మా రాష్ట్రానికి వస్తున్నారు.. మాకు సమాచారం ఇచ్చే మర్యాద కూడా వారికి లేదంటూ దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:  కాంగ్రెస్‌లోకి 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

DO WATCH:

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు