Khammam: కిడ్నాప్ కేసు విషాదాంతం.. శవమై తేలిన సంజయ్, గ్రామస్థుల ఆందోళన
ఖమ్మం యువకుడి కిడ్నాప్ కేసు విషాదాంతమైంది. పోలెపల్లికి చెందిన సంజయ్‌ను దుండగులు చంపేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ కుటుంబసభ్యులు, స్నేహితులు ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు.