/rtv/media/media_files/2025/01/14/HxtYBU9zgaCT5GTzSMUy.jpg)
Rajinikanth JAILER 2 Teaser release
Jailer 2: స్టార్ హీరో రజనీకాంత్ ఫ్యాన్స్ కు పండుగపూట అదిరిపోయే అప్ డేట్ వెలువడింది. తమిళ ఇండస్ట్రీలో మొదటిసారి 1000 కోట్లతో తెరకెక్కిస్తున్న 'జైలర్ 2' మూవీ టీజర్ రిలీజైంది. నాలుగు నిమిషాల టీజర్‌లో రజనీకాంత్‌తో పాటు నెల్సన్ దిలీప్‌కుమార్, అనిరుధ్ కనిపించి అభిమానులను అలరించారు.
#Jailer2 🔥🔥🔥
— Anirudh Ravichander (@anirudhofficial) January 14, 2025
Thalaivar Superstar @rajinikanth with @Nelsondilpkumar and @sunpictures 💥💥💥 It doesn’t get bigger than this 🎉🎉🎉
Tamil - https://t.co/8N8T6iikOS
Telugu - https://t.co/aSEcogcrCC
Hindi - https://t.co/dKOP5dFKJJ#AlapparaKelapparom #ThalaivarNirandharam pic.twitter.com/yN1V0GFmwE
రక్తపాతం, బాంబులతో దద్దరిల్లేలా..
ఈ మేరకు ‘సన్ పిక్చర్స్’ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా టీజర్ ఒక రేంజ్ లో చూపించారు. ఎంట్రీలో అనిరుధ్, దిలీప్ కుమార్ అదరగొట్టేశారు. రజనీ ఎంట్రీ, శత్రువులను పరిగెత్తించి నరికే సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇక అనిరుధ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉక్కు.. పాతరే అంటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై భారీ అంచనాలు పెంచే విధంగా ఉంది. ఇక రజనీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ‘జైలర్’ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాను భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
ఇక జైలర్ మూవీలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణతోపాటు పలువురు స్టార్స్ నటించారు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన జైలర్ రూ. 700 కోట్ల గ్రాస్ వసూల్ చేసి రజినీ కెరీర్‌తో పాటు తమిళ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో జైలర్ 2 వెంటనే అనౌన్స్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగానే ఇవాళ సంక్రాంతి పండుగ సందర్భంగా సీక్వెల్ అనౌన్స్ మెంట్ టీజర్ విడుదల చేశారు. జైలర్ 2లో కూడా వివిధ ఇండస్ట్రీల నుంచి స్టా్‌ర్స్ కీలక పాత్రలు పోషించబోతున్నట్లు తెలుస్తోంది.