/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-26T083621.761-jpg.webp)
Maoist: ఛత్తీష్‌గఢ్ దండకారణ్యంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులకు బిగ్ టాస్క్‌గా మారిన మావోయిస్టు కీలక నేత హిడ్మా జాడను కనిపెట్టినట్లు తెలుస్తోంది. 'ఆపరేషన్ కగార్'లో భాగంగా బస్తర్ అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్న భద్రతా బలగాలు హిడ్మా కదలికలను పసిగట్టి, అతని కార్యకలాపాలపై కన్నేసినట్లు సమాచారం. అంతేకాదు హిడ్మా తరచుగా సంచరించే ప్రాంతాలను బలగాలు చుట్టిముట్టాయనే సమాచారంతో ఏం జరుగుతుందోనని తెలంగాణ- ఛత్తీష్‌గఢ్ బార్డర్ లో ఉత్కంఠ నెలకొంది.
చుట్టుముట్టిన 2వేల మంది బలగాలు..
ఈ మేరకు దాదాపు 2వేల మంది బలగాలు బస్తర్ ను గాలిస్తుండగా పలు మావోయిస్టుల డెన్, క్యాంపులను ధ్వంసం చేస్తున్నారు. ఆకురాలే కాలం దగ్గరపడుతుండగా మావోయిస్టులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్తుండగా ఇదే అదనుగా పోలీసులు గాలింపు ముమ్మరం చేస్తున్నారు. దీంతో బలగాలు జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఎదురుపడిన మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నారు. వివిధ భాగాలుగా ఏర్పడి హిడ్మాకోసం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన పోలీసులు.. ఆయన అడ్డాలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. హిడ్మా కోటలో పాగా వేసిన పోలీసులు వేటగూడెంలో క్యాపులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. గోదావరి తీరం వెంబడి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ప్రాంతాల మీదుగా తెలంగాణలోకి తరలివస్తున్నారనే అనుమానంతో మరింత భద్రతా కట్టుదిట్టం చేశారు.
ఇది కూడా చదవండి: Laurene Powell: మహాకుంభమేళాలో స్టీవ్ జాబ్స్ భార్యకు అస్వస్థత..
ఇదిలా ఉంటే.. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిని మావోయిస్టులు టార్గెట్ చేశారు. ఆయన స్వగ్రామంలో మావోయిస్టుల పేరిట లేఖను అంటించడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే బలవంతంగా పేదల భూములు లాక్కుంటున్నారని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.. నీ ప్రవర్తన అస్సలు బాలేదు!? అంటూ మావోయిస్టుల హెచ్చరిక.
— The 4th Estate (@The4thestate_tv) January 11, 2025
ఆయన సొంత గ్రామం రంగారెడ్డిగూడలో వెలసిన మావోల పోస్టర్..
ఎన్నికలకు ముందు భూముల పై ఇచ్చిన హామీలను విస్మరించావంటూ వార్నింగ్
విచారణ జరుపుతున్న పోలీసులు.. pic.twitter.com/GfGEK16Wpo
బాలానగర్, రాజాపూర్ తదితర ప్రాంతాల్లో ఉన్న కంపెనీల నిర్వాహకులను ఎమ్మెల్యే, ఆయన అనుచరులు బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంకా యజమానులను బెదిరిచి పట్టాభూములను లాక్కున్నాడని ఆరోపించారు. గతంలో గుడిలో విగ్రాహలు దొంగిలించి ఎక్కడ అమ్మావో మాకు తెలుసన్నారు. ఇకపై ఇలాంటిది తమ దృష్టికి వస్తే వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. లచ్చన్నదళం పేరిట ఈ లేఖ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ లేఖపై విచారణ జరుపున్నారు.