Mahanandi: మహానందిలో మరోసారి చిరుత సంచారం!
మహానందిలో మరోసారి చిరుత సంచరించింది.దీంతో మనుషుల ప్రాణాలు పోయేంత వరకు కూడా చిరుతను పట్టుకోరా అంటూ మహానంది ప్రజలు అటవీశాఖ తీరు తెన్నుల పై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
మహానందిలో మరోసారి చిరుత సంచరించింది.దీంతో మనుషుల ప్రాణాలు పోయేంత వరకు కూడా చిరుతను పట్టుకోరా అంటూ మహానంది ప్రజలు అటవీశాఖ తీరు తెన్నుల పై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే డా. సుధాకర్పై పోక్సో కేసు నమోదు అయింది. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సుధాకర్పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ, వైసీపీ వర్గీల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. జోహారపురం గ్రామంలో భూ తగాదా కారణంగా ఇరువర్గాలు దాడికి దిగారు. ఘటనలో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషయంగా ఉండడంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కర్నూలు - ఆదోనిలో ఓ చిన్నారికి హైడ్ అండ్ సీక్ బిస్కెట్ తినిపిద్దామనుకున్న తల్లిదండ్రులకు ఊహించని షాక్ ఎదురైంది. హైడ్ అండ్ సీక్ బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేయగా దాంట్లో పురుగులు బయటపడ్డాయి. కంగుతిన్న తల్లిదండ్రులు వెంటనే ప్యాకెట్లను కిందపడేశారు.
కర్నూలు జిల్లా వైసీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బుట్టా రేణుక మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కలిసింది. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ తరుఫున ఎమ్మిగనూరు నుంచి పోటీ చేసిన బుట్టా రేణుక ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంత్రి ఆనంను కలవడంపై ఆసక్తి నెలకొంది.
AP: పాఠ్య పుస్తకాలపై నాయకుల ఫొటోలు ముద్రించడం సరైన నిర్ణయం కాదన్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఉపాధ్యాయులు. దేశ నాయకులు, ప్రకృతికి సంబంధించిన ఫోటోలు ముద్రించడమే సరైన పద్ధతన్నారు. విద్యార్థుల జీవితాలపై రాజకీయ రంగు పూయడం హేయమైన చర్య అంటూ కామెంట్స్ చేశారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. నంద్యాల మండలం రాయమల్పూరం సచివాలయం శిలాఫలకంను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై గ్రామ వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వెల్దుర్తి ఎస్ఐ, సీఐలపై వేటు పడినట్లు తెలుస్తోంది. నిన్న కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లెలో టీడీపీ నాయకుడు గిరినాథ్ చౌదరి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో అలసత్వం చేసినందుకు ఉన్నతాధికారులు వీరిద్దరిని విఆర్ కు పంపారు.
కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఆశావహుల వజ్రాల వేట కొనసాగుతుంది. చంటి పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు పంటపొలాల్లో డైమండ్స్ కోసం అన్వేషిస్తున్నారు. మరోవైపు, పంట పొలాలు విత్తుకు పనికిరాకుండా పోతున్నాయని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.