Nandyal: నంద్యాల జిల్లా సీతారామపురంలో వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. 30 మంది ఇంట్లోకి చొరబడి సుబ్బరాయుడిని బయటకు లాక్కొచ్చి, కత్తులతో పొడిచి, బండరాయితో మోది హత్య చేశారు. అడ్డుకున్న కుటుంబ సభ్యులపైనా కూడా దాడి చేశారు. ఈ హత్య కేసుపై నంద్యాల జిల్లా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని హోంశాఖ సీరియస్ అయి ఇద్దరు అధికారులను కూడా సస్పెండ్ చేసింది.
పూర్తిగా చదవండి..AP: వైసీపీ కార్యకర్త దారుణ హత్య.. 11 మంది అరెస్ట్..!
నంద్యాల జిల్లా సీతారామపురం వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన మూడు కత్తులు, సెల్ ఫోన్స్, ఫార్చునర్ కారును స్వాదీనం చేసుకున్నారు.
Translate this News: