Road Accident: అదుపుతప్పి బోల్తా పడిన బొలేరో..15 మంది ప్రయాణికులు..!
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఏపీలో ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా ప్రధాన పార్టీల నేతలు తమ ప్రత్యర్థులతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో రివెంట్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి.
కర్నూలు జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. బనగానపల్లెలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు రాళ్ళు రువుకున్నారు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు. బనగానపల్లె మార్కెట్ ఏరియాలో ఇరువర్గాలు ఒక్కసారిగా ఎదురుపడటంతో ఆందోళన పరిస్థితి కనిపిస్తోంది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎన్డీఏ కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి బీజేపీ, జనసేన పార్టీల నియోజవర్గ ఇంచార్జీలను పట్టించుకోనట్లు తెలుస్తోంది. దీంతో రేపు బాలకృష్ణ సభకు వీరు దూరంగా ఉండనున్నట్లు సమాచారం.
కర్నూలు జిల్లా జూపాడు మండలం మడ్లేం గ్రామంలో ఉగాది సందర్భంగా కర్రెమ్మ అమ్మవారికి పోతును బలి ఇచ్చారు గ్రామస్థులు. అనంతరం మాంసం పంపకాల్లో తలెత్తిన విభేదాలతో ఇరు వర్గాలు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
కర్నూలు చిన్న టేకూరులో గురువారం ఉదయం ఉగాది సంబరాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. రథోత్సవం కార్యక్రమం ప్రారంభమైన కొద్ది సేపటికే విద్యుత్ తీగలు రథానికి తగిలాయి. దీంతో కొందరు పెద్దలతో పాటు సుమారు 15 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు
కర్నూలులో ఈ నెల 21, 22వ తేదీల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. పైప్ లైన్ మరమత్తులు కారణంగా ఓల్డ్ కల్లూరు, కృష్ణ నగరు, ఆదిత్య నగరు, కొత్త బస్సు స్టాండ్, జంపాల శివయ్య నగరు, తిలక్ నగరు, చల్లా వారి వీధు ప్రాంతాల్లో నీటి కొరత ఉంటుందన్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగాలకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి ప్రైవేట్ కంపెనీలు. సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకునేలా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.
నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ అటవీశాఖ కార్యాలయం ఎదుట శివ స్వాములు నిరసన చేపట్టారు. శ్రీశైలం వెళ్లే శివ భక్తుల నుండి ఫారెస్ట్ అధికారులు పది రూపాయలు వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.