BREAKING: ఏపీలో మరో భారీ ప్రమాదం ఏపీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్ జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By V.J Reddy 22 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Kurnool: ఏపీలో మరో ఘోర ప్రమాదం జరిగింది. కర్నూల్ జిల్లాలోని ఓర్వకల్ జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. నిర్మాణం చివరి దశలో ఉన్న జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీ మొదటి అంతస్తులో వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కేబుళ్లు దగ్ధం, రూ.కోటి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల వివరాలను కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. అయితే చనిపోయింది ఒకరా? ఇంకా చాలా మంది ఉన్నారా? అనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిన్న 18 మంది మృతి.. అనకాపల్లిలోని అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. 50మందికి పైగా గాయపడ్డారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. చనిపోయిన కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహారం అందిస్తున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ తెలిపారు. అలాగే గాయపడిన వారికి కూడా నష్టపరిహారం అందిస్తామన్నారు. ఈరోజు మృతుల కుటుంబాలను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. అలాగే రేపు మాజీ సీఎం జగన్ పరామర్శిస్తారు. #kurnool #fire-accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి