హీరోయిన్ అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ముఖ్య పాత్రల్లో నటించిన ఘాటి మూవీ ట్రైలర్ వచ్చేసింది. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 5 తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. గంజాయి నేపథ్యంలో తీశారు. ఈ మూవీలో అనుష్క శెట్టి విశ్వరూపం చూపించింది. అరుంధతి వంటి రక్తపాతాన్ని కనబరిచింది. ఇందులోని విజువల్స్, డైలాగ్స్ అన్ని కూడా అదిరిపోయాయి. స్టోరీ మొత్తం గంజాయి చుట్టూ తిరగనున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పుడు ట్రైలర్‌తో ఒక్కసారిగా మూవీ హైప్ అయితే పెరిగింది.
ఇది కూడా చూడండి: RajaSaab Part 2: డార్లింగ్ మామూలోడు కాదుగా.. 'రాజాసాబ్' పార్ట్ 2 కూడా..!
And here it is 🧿😍🙏🏻#GhaatiTrailer out now!
— Anushka Shetty (@MsAnushkaShetty) August 6, 2025
▶️ https://t.co/IupCnnowSq#GHAATI GRAND RELEASE WORLDWIDE ON SEPTEMBER 5th, 2025🧿😍@MsAnushkaShetty & @iamVikramPrabhu💪😍
🎥 Directed by @DirKrish😍
🏢 produced by 😍@UV_Creations & @FirstFrame_Ent
🎶 Music by @NagavelliV😍
🎼… pic.twitter.com/DSLswZ1YIo
వాయిదా వేసుకుంటూ..
గతంలో అనుష్క, క్రిష్ జాగర్లమూడి కలిసి వేదం మూవీ చేశారు. మళ్లీ ఇప్పుడు వీరిద్దరి కాంబోలో ఘాటి వస్తోంది. అయితే ఈ మూవీని మొదట ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఆ తర్వాత జులై 11వ తేదీన అనుకున్నారు. ఈ తేదీలన్నీ కూడా వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఫైనల్‌గా సెప్టెంబర్ 5వ తేదీన థియేటర్లలోకి రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పాన్ ఇండియాలో రిలీజ్ కానుంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై 'ఘాటి' మూవీ తెరకెక్కింది. రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఈ సినిమాకి నిర్మాతలుగా ఉన్నారు. తప్పకుండా ఈ మూవీ హిట్ అవుతుందని అనుష్క ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: అవును ప్రమోషన్ చేశాను తప్పేంటి.. బెట్టింగ్ యాప్స్‌పై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
రెండేళ్ల తర్వాత మళ్లీ..
అనుష్క శెట్టి రెండేళ్ల కిందట మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ చేసింది. ఇందులో నవీన్ పొలిశెట్టి అనుష్కకు జోడీగా కనిపించాడు. చాలా ఏళ్ల తర్వాత అనుష్క ఈ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. సినిమా స్టోరీ కొత్తగా ఉండటంతో పాటు స్క్రీన్ ప్లే కూడా బాగుంది. పాటలు, బీజీఎం, సినిమాటోగ్రఫీ అన్ని కూడా ప్రేక్షకులకు నచ్చాయి. అనుష్క ఈ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చిందనే చెప్పవచ్చు. ఈ మూవీలో అనుష్క తప్పకుండా విశ్వరూపం చూపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ మూవీ హిట్ సాధిస్తుందో లేదో? ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.