మియాపూర్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని దారుణ హత్య!
మియాపూర్ లో బండి స్పందన (29) అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దారుణ హత్యకు గురైంది. పదునైన ఆయుధంతో ఆమెను విచక్షణారహితంగా పొడిచినట్లు తెలుస్తుంది.కానీ అక్కడ ఎలాంటి ఆయుధం లభించలేదని పోలీసులు తెలిపారు.
మియాపూర్ లో బండి స్పందన (29) అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దారుణ హత్యకు గురైంది. పదునైన ఆయుధంతో ఆమెను విచక్షణారహితంగా పొడిచినట్లు తెలుస్తుంది.కానీ అక్కడ ఎలాంటి ఆయుధం లభించలేదని పోలీసులు తెలిపారు.
30 ఏళ్ల క్రితం తండ్రిని ఇద్దరు కొడుకులు కలిసి దారుణంగా చంపి ఇంట్లోనే పాతిపెట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సోదరుల మీద అనుమానం వచ్చిన మూడో కొడుకు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న జితేందర్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతనికి మద్యం తాగించి.. దాడి చేసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
జడ్చర్లకు చెందిన శృతి (23) గచ్చిబౌలి చిన్న అంజయ్య నగర్‌లోని రెడ్‌స్టోన్ హోటల్లో గత రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.అయితే, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం అది ముమ్మాటికీ హత్యేనని, రేప్ చేసి హతమార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
AP: కర్నూలు జిల్లాలో టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత నర్సింహులు నలుగురి సహకారంతో శ్రీనివాసులును హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిగత గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెప్పారు.
సూర్యాపేట జిల్లాలో తాటి చెట్టు పై ఉరేసుకొని ఓ గీత కార్మికుడు మృతి చెందాడు.ముకుందాపురానికి చెందిన దేశగాని వెంకటేశం(75) రోజులాగే పనిలో భాగంగా కల్లు తీయడానికి శుక్రవారం ఉదయం గ్రామ శివారుకి వెళ్లారు.ఈ క్రమంలోనే తాటి చెట్టు ఎక్కి ఉరేసుకున్నారు.
ఏలూరు జిల్లాకు చెందిన బాలాజీ అనే సీఆర్ ఫీఎఫ్ కానిస్టేబుల్ దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తమామల మీద దాడిచేసేందుకు వెళ్లిన బాలాజీ భార్య చెల్లెలి రెండు నెలల కొడుకును కొట్టి చంపాడు. స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
వైఎస్సాఆర్ కడప జిల్లా కమలాపురం ఏఎస్సైగా గా పని చేస్తున్న నాగార్జున రెడ్డి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం రాత్రి ఆయన విధులు ముగించుకుని బుధవారం ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.
జమ్మూ-కాశ్మీర్లో మళ్ళీ జవాన్లకు , ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. అంతేకాదు వారి నుంచి మందుగుండు సామాగ్రి, ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.