Nursing Student : గచ్చిబౌలిలో నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య! జడ్చర్లకు చెందిన శృతి (23) గచ్చిబౌలి చిన్న అంజయ్య నగర్‌లోని రెడ్‌స్టోన్ హోటల్‌లో గత రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.అయితే, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం అది ముమ్మాటికీ హత్యేనని, రేప్ చేసి హతమార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Bhavana 16 Sep 2024 | నవీకరించబడింది పై 16 Sep 2024 10:37 IST in తెలంగాణ క్రైం New Update షేర్ చేయండి హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో గల రెడ్ స్టోన్ హోటల్ లో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. సోమవారం ఉదయం ఓ గదిలో శృతి అనే నర్సింగ్ విద్యార్థిని ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయింది. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హోటల్ కి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జడ్చర్లకు చెందిన శృతి (23) గచ్చిబౌలి చిన్న అంజయ్య నగర్‌లోని రెడ్‌స్టోన్ హోటల్‌లో గత రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గతంలో యశోద హాస్పిటల్‌లో ట్రైనీ నర్సుగా పనిచేసిన శృతి కొంతకాలం క్రితం ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్లిపోయింది. ఇటీవలే నగరానికి తిరిగివచ్చిన శృతి జాబ్ సెర్చింగ్‌లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే గత రాత్రి చిన్న అంజయ్య నగర్ రెడ్‌స్టోన్ హోటల్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది. అయితే, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం అది ముమ్మాటికీ హత్యేనని, రేప్ చేసి హతమార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి అనుమానాలను బలపరుస్తూ హోటల్ గదిలోని బెడ్ కింద మూడు బీర్ బాటిళ్లు, ఓ వాటర్ బాటిల్, చిప్స్ ప్యాకెట్ ఇతర వస్తువులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా గదిలో రక్తపు మరకలు కూడా ఉండడం ఆమెను అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. Also Read: అమెరికాలో కాల్పులు..ట్రంప్ నకు సమీపంలోనే ఘటన! #hyderabad #nursing-student #killed మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి