TG: రైతు భరోసాపై పకడ్బంది ప్లాన్.. సాగుచేయని భూమిని ఎలా గుర్తిస్తారంటే
రైతు భరోసా నిజమైన లబ్దిదారులకు అందించేందుకు తెలంగాణ సర్కార్ పకడ్బంది ప్లాన్ చేస్తోంది. సాగు భూములకు మాత్రమే ఈ స్కీమ్ వర్తించేలా ఫీల్డ్ వెరిఫికేషన్ బృందాలు క్షేత్రస్థాయిలో జాబితా తయారు చేస్తున్నాయి. జిల్లా కలెక్టర్, డీఏవో, ఎంపీడీవోలు పరిశీలించనున్నారు.
BREAKING: దానం నాగేందర్‌కు మంత్రి పదవి.. సీఎం రేవంత్ సంచలన వ్యూహం ఇదే!
ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కేబినెట్లోకి తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో జీఎచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా నుంచి దానంకు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. ఢిల్లీ టూర్లో హై కమాండ్‌తో చర్చించనున్నారట.
TG: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. జనవరి 26 నుంచి 4 కొత్త పథకాలు అమలు!
తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరో 4 కొత్త పథకాలు అమలు చేయబోతున్నట్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు.
TG: డమ్మీ చెక్కులిస్తున్న సీఎం రేవంత్.. హరీష్ రావు సంచలన ఆరోపణలు!
సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ కోసం ఇచ్చిన చెక్కులు డమ్మీ కావొచ్చంటూ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనించాలన్నారు. మాట తప్పినందుకు సీఎం రేవంత్ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
TG: కౌశిక్ రెడ్డికి ఉచ్చు బిగిస్తున్న పోలీసులు.. పీడీ యాక్ట్ కేసు, రెండ్రోజుల్లో అరెస్ట్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ కలెక్టరేట్ లో ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేసిన కౌశిక్ రెడ్డిపై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సంజయ్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
MLC Kavitha: సీఎం రేవంత్ మూలాలు అక్కడివే.. కవిత సంచలన ఆరోపణలు!
సీఎం రేవంత్ రెడ్డివి ఆర్ఎస్ఎస్ మూలాలే అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. అందుకే మైనారిటీల పట్ల వివక్ష చూపుతున్నారంటూ మండిపడ్డారు. మైనారిటీ డిక్లరేషన్‌ను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
TG: ఇందిరమ్మ ఇళ్లు ఫస్ట్ వారికే.. సంక్రాంతివేళ మంత్రి పొన్నం శుభవార్త!
ఇందిరమ్మ ఇళ్లపై సంక్రాంతి వేళ రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్దిదారులను ఎంపికచేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ చేసి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.
CM Revanth: రాష్ట్రానికి కొత్త బీర్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
మద్యం సరఫరా కంపెనీల ఎంపికలో పారదర్శక విధానాన్ని పాటించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.కొత్త కంపెనీల నుంచి దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ ఇవ్వాలని తెలిపారు. అలాగే నెల రోజుల పాటు సమయం ఇచ్చి బ్రాండ్ల పేరుతో దరఖాస్తులు తీసుకోవాలని తెలిపారు.