TG Jobs: తెలంగాణ యువతకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. 30 వేల జాబ్స్.. వివరాలివే!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగిసింది. రేపు రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ కు తిరిగి రానుంది. ఈ పర్యటనలో దాదాపు 12 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. తద్వారా 30 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

New Update
Telangana Jobs CM Revanth Japan Tour

Telangana Jobs CM Revanth Japan Tour

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ లో చేపట్టిన పర్యటన ఈ రోజుతో ముగిసింది. సీఎం రేవంత్ టీమ్ రేపు హైదరాబాద్ కు తిరిగి రానుంది. ఈ పర్యటనలో మొత్తం రూ.12,062 కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడానికి ఒప్పందాలు జరిగాయి. దీంతో దాదాపు 30,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కంపెనీల వారీగా లభించిన పెట్టుబడుల వివరాలు ఇలా ఉన్నాయి.

మారుబెని:

హైదరాబాద్‌ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం జరిగింది. రూ.1,000 కోట్లు ప్రారంభ పెట్టుబడి కాగా రూ.5,000 కోట్ల పెట్టుబడుల అంచనా అని అధికారులు తెలిపారు. తద్వారా 30,000 ఉద్యోగాలు లభించనున్నట్లు  చెప్పారు. 

ఎన్టీటీ డేటా, నెయిసా:

హైదరాబాద్‌లో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు. దీంతో రూ.10,500 కోట్ల పెట్టుబడులు లభించనున్నాయి.

తోషిబా ట్రాన్స్ మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (TTDI):

రుద్రారంలో విద్యుత్ పరికరాలు, సామాగ్రి తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు. మొత్తం రూ.562 కోట్ల పెట్టుబడులతో ఈ కంపెనీని ఏర్పాటు చేయనున్నారు.

టామ్​ కామ్​ (TOMCOM) తో టెర్న్, రాజ్ గ్రూప్:

జపాన్‌లో 500 ఉద్యోగ నియామకాలకు ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ యువతకు ఈ అవకాశాలు రానున్నాయి.

(telugu-news | telugu breaking news | CM Revanth)

Advertisment
తాజా కథనాలు