విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన అంబులెన్స్
కాకినాడలో ఉప్పాడలోని ఓ చిన్నారి ఇంట్లో ఆడుతుంటే బీరువా పడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించగా కాకినాడ ఆసుపత్రికి ఆక్సిజన్ సాయంతో తీసుకెళ్లమన్నారు. కానీ అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో మార్గమధ్యంలోనే ఆ చిన్నారి మృతి చెందింది.