భర్త దుబాయ్లో సంపాదిస్తే..  భార్య ప్రియుడికి ఖర్చు పెట్టింది.. పాపం చివరకి

కట్టుకున్న భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ భర్త కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. అతడు చనిపోయే ముందు రాసిన సూసైడ్‌ నోట్‌ ప్రకారం మృతుడి భార్యతో పాటుగా మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
dubai-husband

dubai-husband

కట్టుకున్న భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ భర్త కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  ఎస్‌ఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన చల్లా దుర్గారావు (29) 2025 మార్చి 25 వ తేదీన పెరవలి లాకుల వద్ద బైక్ ను అక్కడే వదిలేసి కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరుసటి రోజు మార్చి 26వ తేదీన ఇరగవరం మండలం రాపాక వద్ద శవమై తేలాడు. అతడు చనిపోయే ముందు రాసిన సూసైడ్‌ నోట్‌ ప్రకారం తన చావుకు కారణమైన ఖండవల్లి గ్రామానికి చెందిన మోత్రపు అమోఘ్, అతడి తండ్రి మోత్రపు శివ ప్రసాద్, తన భార్య చల్లా దివ్య కుమారి కారణమని తన సూసైడ్‌ నోట్‌ లో వెల్లడించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఈ ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.  

Also read :  చావుకు వెళ్తే చచ్చేంత పనైంది.. శవాన్ని నడిరోడ్డుపైనే వదిలేసి పరుగో పరుగు!

అమోఘ్‌ను ఇంటికి వెళ్లి

దుర్గారావు భార్య దివ్య కుమారి అదే గ్రామానికి చెందిన మోత్రపు అమోఘ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ  విషయాన్ని దుర్గారావు, కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు అమోఘ్‌ను ఇంటికి వెళ్లి నిలదీశారు. దీంతో అతడితో పాటు తండ్రి శివప్రసాద్‌  సైతం దుర్గారావును దుర్భాషలాడి దారుణంగా అవమానించారు. దీంతో మనస్తాపం చెందిన  దుర్గారావు తన చావుకు వీరే కారణమంటూ సూసైడ్ నోట్ రాసి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ లో తాను దుబాయి వెళ్లి సంపాదించినదంతా తన భార్య ప్రియుడికి దోచిపెట్టిందని, దీంతో తాను ఆర్థికంగా చితికిపోయానని, వివాహేతర సంబంధంతో తీవ్ర మనస్తాపం చెందానట్లుగా దుర్గారావు  తెలిపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.  

Also Read :  Telangana: రేవంతన్న గుడ్ న్యూస్.. B.Tech ఫెయిలైన వారికీ కూడా సర్టిఫికెట్!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు