yv vikranth reddy: కాకినాడ పోర్టు కేసులో వైవీ విక్రాంత్ రెడ్డికి బిగ్ షాక్!

కాకినాడ పోర్టు కేసులో వైవీ విక్రాంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. కేసుకు సంబంధించి వివరాలు సమర్పించాలని సీఐడీని ఆదేశించింది. 

New Update
eererer

AP News: కాకినాడ పోర్టు కేసులో వైవీ విక్రాంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. కేసుకు సంబంధించి వివరాలు సమర్పించాలని సీఐడీని ఆదేశించింది. 

ఇది కూడా చదవండి: నిఖేశ్‌కుమార్‌ ఫ్రెండ్ లాకర్‌లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు!

సీఐడీకి కీలక ఆదేశాలు..

ఈ మేరకు ముందస్తు బెయిల్ పై విక్రాంత్ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలని విక్రాంత్ న్యాయవాది కోరారు. అయితే ఫిటిషన్ తోసిపుచ్చిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కేసుకు సంబంధించి వివరాలు సమర్పించాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విక్రాంత్ న్యాయవాదులు కోరగా.. మధ్యంతర ఉత్తర్వులకు అంగీకరించేది లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణను మరో వారానికి వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: Sukumar : సుకుమార్ ఆ సినిమాను మొదట బన్నీతో చేయాలనుకున్నాడా?

కేసు వివరాలేంటి.. 


కాకినాడ పోర్టు, సెజ్ కు సంబంధించి 41 శాతం వాటాలు బలవంతంగా లాగేసుకున్నారని వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, శరత్ రెడ్డి, విజయసాయిరెడ్డిలపై ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ వ్యవహారంలో కేసు కూడా నమోదైంది. విక్రాంత్ రెడ్డి ఏ1గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో, విక్రాంత్ రెడ్డి తాజాగా హైకోర్టును ఆశ్రయించాడు. కాకినాడ పోర్టు, సెజ్ విషయంలో తనకు సంబంధం లేదని విక్రాంత్ రెడ్డి వివరించాడు. 

ఇది కూడా చదవండి: రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలం.. దొరికిన కాంగ్రెస్ ఎంపీ

ఇది కూడా చదవండి: ఇందిరమ్మ ఇళ్లు మూడు నమూనాల్లో.. ఇందులో మీ ఇష్టం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు