AP: సైకిల్ పై వెళ్తున్న చిన్నారులను కాటేసిన కరెంట్.. కడపలో పెను విషాదం!
కడప జిల్లా బెల్లం మండిలో దారుణం చోటుచేసుకుంది. సైకిల్ పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులకు వేళాడుతున్న విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కు గురయ్యారు. ఈ ప్రమాదంలో తన్విరుల్లా అనే విద్యార్థి చనిపోయాడు. తీవ్ర గాయాలైన మరో విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.